తడబడ్డ పవర్ స్టార్, తన సినిమా పేరును తానే మర్చిపోయిన పవన్ కళ్యాణ్, వైరల్ వీడియో
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్టాడుతుండగా ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. ఆయన తన సినిమా పేరు మర్చిపోయారు.. తడపడ్డాడు.. చివరకు ఎవరో అందించగా చెప్పారు. ఇంతకీ ఈ ఫన్నీ సంఘటన ఎక్కడ జరిగిందంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్టాడుతుండగా ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. ఆయన తన సినిమా పేరు మర్చిపోయారు.. తడపడ్డాడు.. చివరకు ఎవరో అందించగా చెప్పారు. ఇంతకీ ఈ ఫన్నీ సంఘటన ఎక్కడ జరిగిందంటే..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బిజీ బిజీ.. అటు రాజకీయాల పరంగ కూడా ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇటు సినిమాలు కూడా కంప్లీట్ చేయాలి అని సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఈక్రమంలో ఆయన పలు సినిమా ఫంక్షన్స్ కు కూడా హాజరవుతూ.. బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. పొలిటికల్ టూర్లు కూడా చేస్తూ.. ఏపీలో హీటు పెంచుతున్నాడు.
ఇక ఈ మధ్యలో కొన్ని సినిమా ఈవెంట్స్ కి కూడా హాజరవుతూ వస్తున్నారు పవర్ స్టార పవన్ కళ్యాణ్. తాజాగా పవన్ కళ్యాణ్.. ఒక తెలుగు టీవీ ఛానల్ ఓపెనింగ్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వార్తలు కోసం ఆ ఛానల్ లాంచ్ అయ్యింది. ఇక ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సినిమా జర్నలిజం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
పవన్ మాట్లాడుతూ.. సినిమావాళ్ల వాయిస్ ను గట్టిగా వినిపించడానికి ఓ ఛానల్ తప్పకుండా ఉండాలన్నారు. ముఖ్యంగా ఆయన కొన్ని ఇండ్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. నా సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతల నుంచి మీ ఛానల్ కి నేను మద్దతు ఇస్తాను అంటూ పేర్కొన్నాడు. ఈక్రమంలోనే తన సినిమా నిర్మాతల పేర్లు చెబుతూ.. పవన్ తడబడ్డాడు. వకీల్ సాబ్ దర్శకుడు దిల్ రాజు, సర్దార్ భగత్ సింగా.. అంటూ సినిమా పేరు పూర్తిగా గుర్తుకు రాక ఇబ్బంది పడ్డాడు పవర్ స్టార్.
ఇక చేసేది లేక ఏదో ఉంది..సినిమా పేరు భగత్ సింగ్ అని గుర్తుంది. ఆసినిమా నిర్మాత నవీన్ నుంచి కూడా మద్దతు ఉంటుంది అని అన్నారు. ఇక ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. పవర్ స్టార్ ఇలా తన సినిమాల పేర్లు కూడా మర్చిపోతే.. ఇక సినిమాలు చేసేవారి పరిస్థితి ఏంటీ అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరికొంత మంది మాత్రం ఆయన ఉన్న బిజీలో అది సహజం అని సపోర్ట్ చేస్తున్నారు. కొంత మంది నెటిజెన్స్ మాత్రం కాస్త ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.