బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఇంటిమేట్ సీన్స్ చేయటం అనేది కామన్‌. స్టార్‌ హీరోయిన్స్‌ నుంచి యంగ్ హీరోయిన్ల వరకు అందరూ అలాంటి సీన్స్‌లో నటించిన వారే. ఇక లిప్‌ లాక్‌ సీన్స్‌ అయితే బాలీవుడ్‌ లో చాలా కామన్‌. అయితే బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఐశ్వర్య మాత్రం చాలా కాలం పాటు లిప్‌ లాక్‌ చేయకుండానే కెరీర్‌ను నెట్టుకు వచ్చింది. అయితే ఓ భారీ కమర్షియల్ సినిమా కోసం లిప్‌ లాక్‌ సీన్‌ చేసిన ఐశ్వర్య రాయ్‌ ఆ లిప్‌ లాక్‌ కారణంగా లీగల్‌ సమస్యలు ఎదుర్కొంది.

2006లో హృతిక్‌ రోషన్‌, అభిషేక్‌ బచ్చన్, ఐశ్వర్యరాయ్‌లుప్రధాన పాత్రల్లో తెరకెక్కిన అడ్వంచరస్‌ యాక్షన్‌ డ్రామా ధూమ్‌ 2. ఈ సినిమా కోసం హృతిక్‌ తో కలిసి ఓ డీప్‌ లిప్‌ లాక్ చేసింది ఐశ్వర్య. అయితే ఈ కిస్‌ సీన్‌ కారణంగా ఐష్‌ లీగల్‌ సమస్యలు ఎదుర్కొంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఐశ్వర్య ఆ సీన్‌ కారణంగా తనకు ఎదురైన ఇబ్బందుల గురించి మాట్లాడింది.

ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత తనకు ఎదురైన ఇబ్బందుల గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో వెళ్లడించింది. `ధూమ్‌ 2 సినిమాలో లిప్‌ లాక్‌ సీన్‌ చేసిన తరువాత నాకు సమస్యలు వచ్చాయి. చాలా నోటీసులు వచ్చాయి. లీగల్ నోటీసులు కూడా వచ్చాయి. `మీరు సమాజంలో బాధ్యత కలిగిన వ్యక్తులు, సెలబ్రిటీలు మీలాంటి వారు ఏదైనా పని చేసేప్పుడు బాధ్యతగా చేయాలి` అంటూ చాలా మంది నాకు నోటీసలు పంపించారని చెప్పింది ఐశ్వర్య రాయ్‌.

అయితే ఐష్‌ మాత్రం నేను ఒక నటిగా ఆ పాత్రకు అవసరమైన మేరకు మాత్రమే నటించానని చెప్పింది. అభిమానులు ఇలా స్పందించటం ముందు కాస్త ఇబ్బందిగానే అనిపించినా తరువాత వాళ్లు నా పట్ల చూపించిన అభిమానానికి ఆనందంగా ఉందని చెప్పింది.