Asianet News TeluguAsianet News Telugu

Inflation Effect: కొత్త ఏడాదిలో కూరగాయల కోనాలంటే కష్టమే..!!

రిటైల్ ద్రవ్యోల్బణం మూడేళ్ల గరిష్ట స్థాయిని చేరుకున్నది. కూరగాయల ధరలు వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ఈ రిటైల్​ ద్రవ్యోల్బణం నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అయినా 2020 ప్రారంభంలోనూ కూరగాయల ధరలు మరింత పెరుగుతాయని బ్రోకరేజి సంస్థలు అంచనా వేస్తున్నాయి.

Inflation leaves consumers teary-eyed as pricey onions, food items bite
Author
Hyderabad, First Published Dec 28, 2019, 5:47 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఈ ఏడాది చివరి త్రైమాసికంలో టమాటా ధరలు ఆకాశాన్నంటాయి. ఉల్లి ధరలు వినియోగదారులకు అక్షరాలా కళ్ల నీళ్లు తెప్పిస్తున్నాయి. ఖరీదైన ఆహార పదార్థాల ధరలు రిటైల్​ ద్రవ్యోల్బణాన్ని మూడేళ్ల గరిష్ఠానికి ఎగదోశాయి. కిలోగ్రామ్ ఉల్లిపాయల ధర సుమారుగా రూ.200 వరకు ఉండగా, అంతకుముందు త్రైమాసికంలో టమాటా రిటైల్​ ధర కిలోకు రూ.80 వరకు పెరిగింది. 

ఇక పంట నష్టం, తగినంత సరఫరా లేకపోవడం వల్ల ఉల్లిగడ్డలతోపాటు బంగాళదుంపలూ ప్రియం అయ్యాయి. దీంతో ఈ మూడు కూరగాయలను టాప్ (TOP) ప్రియారిటీలో చేర్చేశారు. డిసెంబర్​లో కిలో రూ.30 వరకు ఉన్న బంగాళాదుంపలు, ప్రభుత్వ నియంత్రణ చర్యల వల్ల ప్రస్తుతం రూ.20 నుంచి రూ.25 పలుకుతున్నాయి. ఖరీదైన కూరగాయలు ఖరీదైన కూరగాయలు రిటైల్ ద్రవ్యోల్బణాన్ని నెమ్మదిగా ఎగదోస్తాయి. 

also read డిసెంబర్ 31 లోగా పాన్-ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి....

2019 అంతా ఈ కూరగాయల ద్రవ్యోల్బణం ఆర్​బీఐ అంచనాలకు అనుగుణంగా నాలుగు శాతంగానే నమోదైంది. నవంబర్​లో మాత్రం తొలిసారి మూడేళ్ల గరిష్ఠానికి అంటే 5.54 శాతానికి చేరింది.కేంద్ర ప్రభుత్వం టమాటా, ఉల్లి, బంగాళాదుంప (టీఓపీ)లకు 2018-19 కేంద్ర బడ్జెట్​లో అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. వీటి ఉత్పత్తి, ప్రాసెసింగ్​ పెంచడానికి, ధరల అస్థిరతను తగ్గించడానికి రూ.500 కోట్ల మేర నిధులు కేటాయించింది. ప్రభుత్వం 2019లో చాలా వరకు ధరల నియంత్రణలో విజయవంతమైనా చివరిలో మాత్రం దెబ్బతింది. 

ఫలితంగా పెరుగుతున్న ఉల్లి ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం ఆలస్యంగా చర్యలు ప్రారంభించింది. ఈజిప్ట్​, టర్కీ, అఫ్గానిస్థాన్​ నుంచి భారీగా ఉల్లి దిగుమతి చేసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకుంది.ప్రస్తుతం రోజువారీ లెక్కన ఉల్లిగడ్డలు, బంగాళా దుంపలు, టమోటాలు దిగుమతి అవుతున్నాయి.

ఫలితంగా దేశీయ రిటైల్​ మార్కెట్లలో టమోటా, ఉల్లిగడ్డ, బంగాళా దుంపల ధరలు రూ.130, రూ.20- రూ.30, రూ.30-రూ.40 వరకు దిగొచ్చాయి. మరోవైపు వెల్లుల్లి ధర 100 గ్రాములకు సుమారు రూ.30-రూ.40 వరకు పెరిగింది.రిటైల్​ ద్రవ్యోల్బణం ఆధారంగా ప్రధానంగా ద్వైమాసిక ద్రవ్య విధానం అంచనా వేసే భారతీయ రిజర్వ్​ బ్యాంక్ వినియోగదారుల ధరల సూచిక (సీపీఐ) ద్రవ్యోల్బణాన్ని నాలుగు శాతానికి నియంత్రించాలని నిర్ణయించింది.

Inflation leaves consumers teary-eyed as pricey onions, food items bite

దీనికి రెండు శాతం అటుఇటైనా వృద్ధికి తోడ్పడాలని సంకల్పించింది. ఆర్​బీఐ డిసెంబర్​లో తన ద్రవ్య విధాన సమీక్షలో రిటైల్​ ద్రవ్యోల్బణ అంచనాలను 2019-20 రెండో భాగంలో 5.1 - 4.7 శాతానికి పెంచింది. ప్రధానంగా ఖరీదైన ఉల్లిపాయలు, పండ్లు, పప్పుధాన్యాలు, పాలు, తృణధాన్యాలపై, అంతకు ముందు ఈ అంచనాలు 3.5 - 3.7 శాతంగా ఉండేవి.

అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి ఆర్ధభాగంలో ఈ అంచనాలకు 4 - 3.8 శాతానికి పెంచింది. 2020 ప్రారంభంలో కూరగాయల ధరలు మరింత అధికమవుతాయని అంచనా వేస్తున్నట్లు ఐసీఆర్​ఏ ఆర్థికవేత్త అదితి నాయర్​ తెలిపారు.‘భూగర్భ జలాలు, రిజర్వాయర్​ల్లో నీళ్లు పుష్కలంగా ఉంటే.. రబీ ఉత్పత్తి పెరిగి తృణధాన్యాల దిగుబడి పెరుగుతుంది.

also read బ్యాంక్ చెక్ పైన డేట్ రాస్తున్నారా?...అయితే జాగ్రత్త....లేదంటే..?

పంట భూముల విస్తీర్ణం రానురాను తగ్గుతున్నందున పప్పులు, నూనె గింజల ఉత్పత్తిలో క్షీణత కనిపిస్తోంది. ఫలితంగా రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఇది ఆందోళనకరమైన విషయం’ అని ఐసీఆర్​ఏ ఆర్థికవేత్త అదితి నాయర్ తెలిపారు.ఐసీఆర్​ఓ 20189 డిసెంబర్​లో వినియోగదారుల ధరల సూచిక (సీపీఐ) ద్రవ్యోల్బణం 5.8 - 6 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది.

2019లో హోల్​సేల్​ ద్రవ్యోల్బణం కథ భిన్నంగా ఉంది. జనవరిలో 3.58 శాతంగా ఉన్న హోల్​సేల్​ ద్రవ్యోల్బణం అక్టోబర్​ నాటికి 0.16 శాతానికి తగ్గింది. ఈ మార్పునకు ప్రధానంగా చౌక ఇంధనం, విద్యుత్​ కారణం.బ్రోకరేజ్​ సంస్థ ఆనంద్​ రతి ప్రకారం డబ్ల్యూపీఐ - సీపీఐ మధ్య తేడా నవంబర్​లో 5.5 శాతంగా ఉంది. అంటే రిటైల్​ ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయిలో ఉంటే.. హోల్​సేల్​ ద్రవ్యోల్బణం 0.6 శాతం మాత్రమే ఉందని పేర్కొంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios