స్త్రీలు మాత్రం వీలైనంత వరకు నార్మల్ డెలివరీ జరిగితే బాగు అని కోరుకుంటారు. అయితే... అలా జరగాలంటే..గర్భం దాల్చినప్పటి నుంచి.. ఒక విషయం కచ్చితంగా ఫాలో అవ్వాలట.
గర్భం దాల్చడం ప్రతి స్త్రీ జీవితంలో చాలా ముఖ్యమైన విషయం. ఈ సమయంలో ప్రతి స్త్రీ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు చాలా సహజం. కానీ... గర్భం దాల్చినప్పుడు స్త్రీలల్లో మార్పులు.. శారీరకంగా మాత్రమే కాదు.. మానసికంగానూ జరుగుతాయి. ఆ మార్పులను ఆస్వాదిస్తూ.. పుట్టబోయే బిడ్డపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు.
అయితే... ఈ రోజుల్లో నార్మల్ డెలివరీ జరగడం అనేది మూమలు విషయం కాదు. అసలు ఇది సర్వ సాధారణ విషయంలా అస్సలు కనపటడం లేదనే చెప్పాలి. కానీ... స్త్రీలు మాత్రం వీలైనంత వరకు నార్మల్ డెలివరీ జరిగితే బాగు అని కోరుకుంటారు. అయితే... అలా జరగాలంటే..గర్భం దాల్చినప్పటి నుంచి.. ఒక విషయం కచ్చితంగా ఫాలో అవ్వాలట. ఏం చేస్తే.. డెలివరీ చాలా సులభంగా, సుఖంగా, నార్మల్ గా అవుతుందో తెలుసుకుందాం...
గర్భం దాల్చిన తర్వాత.. కచ్చితంగా మహిళలు.. వాకింగ్ చేయడం తమ లైఫ్ లో ఒక భాగం చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల.. నార్మల్ డెలివరీ అవ్వడమే కాదు.. చాలా ప్రయోజనాలు ఉన్నాయట. ఉదయాన్నే వాకింగ్ వల్ల కలిగే ఉపయోగాలేంటో తెలుసుకుందాం....
1.వెయిట్ కంట్రోల్...గర్భం దాల్చిన తర్వాత.. మహిళలు బరువు పెరగడం సహజం. అలా పెరగితేనే.. కడుపులో బిడ్డ ఎదుగుదల కూడా బాగుంటుంది. అయితే... మరీ ఎక్కువగా పెరిగిపోతే.. తర్వాత తిప్పలుపడాల్సి ఉంటుంది. మధుమేహం, బీపీ లాంటి ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. అలా జరగకుండా ఉండటానికి.. ముందు నుంచే.. వాకింగ్ అలవాటు చేసుకోవాలి. రెగ్యులర్ గా ఉదయం పూట వాకింగ్ చేయడం వల్ల... వెయిట్ ని ఈజీగా కంట్రోల్ చేసుకోగలుగుతాం.
2.గుండె ఆరోగ్యం.. గర్భం గుండె వ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తుంది. అభివృద్ధి చెందుతున్న పిండానికి రక్తాన్ని పంప్ చేయడానికి గుండె చాలా కష్టపడడమే దీనికి కారణం. అందువల్ల, గర్భధారణ సమయంలో గుండె ఆరోగ్యంగా ఉండటానికి నడక ఉత్తమ మార్గం. ఇది గుండెను బలపరుస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
3. ఒత్తిడిని తగ్గిస్తుంది : గర్భం అనేది ప్రతి స్త్రీకి ఒత్తిడితో కూడిన , భావోద్వేగ సమయం. కాబట్టి, ఈ కాలంలో ఒత్తిడిని తగ్గించుకోవడానికి మార్నింగ్ వాక్ చేయడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే నడక ఆందోళనను తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. దీని ద్వారా మీరు సులభంగా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
4. నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది : గర్భధారణ సమయంలో కొంతమంది స్త్రీలకు సరైన నిద్ర ఉండదు. కడుపులో శిశువు కదలిక కూడా దీనికి కారణం కావచ్చు. కాబట్టి, ప్రతిరోజూ ఉదయం ఇలా చేయడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడటమే కాకుండా, గర్భం దాల్చడానికి శరీరాన్ని సిద్ధం చేస్తుంది.
5. ప్రసవాన్ని సులభతరం చేస్తుంది: ముఖ్యంగా గర్భధారణ సమయంలో నడక సాధన చేయడం వల్ల శరీరాన్ని ప్రసవానికి సిద్ధం చేస్తుంది. అంతే కాకుండా పెల్విక్ కండరాలను బలపరుస్తుంది. ఇది ప్రసవాన్ని కూడా సులభతరం చేస్తుంది. అందుకే.. ఉదయంపూట కనీసం 30 నిమిషాలు నడక అలవాటు చేసుకోవడం చాలా ముఖ్యం.