ఇషా అంబానీ డ్రెస్ పై వేద మంత్రాలు... ఆ మంత్రం అర్థమేంటో తెలుసా?

By ramya Sridhar  |  First Published Jul 12, 2024, 2:53 PM IST

ఎప్పుడూ లగ్జరీ దుస్తుల్లో మెరిసే ఇషా అంబానీ.. తన సోదరుడి పెళ్లి విషయంలో మాత్రం.. తన దుస్తులకు ఏదో ఒక ప్రత్యేకత ఇస్తూనే వచ్చింది. ఈ పూజకి కరెక్ట్ గా సూటయ్యేలా వేదమంత్రాలతో కూడిన డ్రెస్ ధరించడం విశేషం.


మన దేశ కుబేరుడు ముకేష్ అంబానీకి పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఎక్కడ చూసినా అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి తంతు గురించే వినపడుతోంది. ఈ రోజే అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది.

ఈ వివాహం నేపథ్యంలో... అంబానీ కుటుంబం దగ్గరుండి మరీ రీసెంట్ గా శివ శక్తి పూజను నిర్వహించారు. ఈ శివశక్తి పూజకు అంబానీ కుటుంబం మొత్తం హాజరయ్యారు. కాగా.. పూజ సమయంలో ఇషా ధరించిన దుస్తులు మాత్రం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. ఎప్పుడూ లగ్జరీ దుస్తుల్లో మెరిసే ఇషా అంబానీ.. తన సోదరుడి పెళ్లి విషయంలో మాత్రం.. తన దుస్తులకు ఏదో ఒక ప్రత్యేకత ఇస్తూనే వచ్చింది. ఈ పూజకి కరెక్ట్ గా సూటయ్యేలా వేదమంత్రాలతో కూడిన డ్రెస్ ధరించడం విశేషం.

Latest Videos

ఢిల్లీకి చెందిన ప్రముఖ డిజైనర్ హౌజ్ ఢిల్లీ వింటేజ్ కో .. ఇషా ధరించిన డ్రెస్ ని డిజైన్ చేశారు. ఆ లెహంగాపై పూర్వకాలం నాటి.. అలంకారాలు, భారతీయ సంస్కృతి మొత్తం క్లియర్ గా వచ్చేలా డిజైన్ చేయడం విశేషం. ఇషా లెహంగా ప్రతి కోసన ఎక్కడ చూసినా భారతీయ సంస్కృతి క్లియర్ గా కొట్టొచ్చినట్లు కనపడటం విశేషం.  అయితే.. లెహంగా చివరన ఓ శ్లోకం కూడా రాసి ఉంది. 

 'కర్మణ్యే వాదికారస్తే, మా పాలేషు కథా సనా' అనే  శ్లోకం కూడా రాసి ఉంది. దాని అర్థం ఏమిటి  అంటే మీ చర్యలను చేసే హక్కు మీకు ఉంది, కానీ చర్యల ఫలాలను పొందే హక్కు మీకు లేదు. అని.. మహా భారతంలో కృష్ణుడు చెప్పిన గీతలోని ఓ శ్లోకం అది.  ఆ శ్లోకం, దాని అర్థం.. నెట్టింట మరింత ఎక్కువగా ఆకట్టుకుంటోంది. 

click me!