జుట్టు పెరగడానికి మెంతులను ఎలా ఉపయోగించాలో తెలుసా?

By Shivaleela Rajamoni  |  First Published Jul 12, 2024, 3:09 PM IST

మసాలా దినుసుల్లో మెంతులు ఒకటి. ఇది మన ఆరోగ్యానికే కాకుండా.. మరెన్నో వాటికి ఉపయోగపడుతుంది. మెంతులను ఉపయోగించి చుండ్రు, హెయిర్ ఫాల్ వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. అంతేకాదు ఇది మన జుట్టును కూడా పెంచుతుంది. దీనికోసం మెంతులను ఎలా వాడాలంటే?


హెయిర్ ఫాల్ సమస్యా చాలా మందికి ఉంటుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి జనాలు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. కానీ జుట్టు  ఆరోగ్యంగా ఉండాలంటే నేచురల్ పద్దతులనే ఫాలో అవ్వడం మంచిది. అయితే మీ జుట్టును స్ట్రాంగ్ గా, పొడుగ్గా, ఒత్తుగా చేయడంలో మెంతులు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. మెంతులు జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడతాయి. వీటిని ఉపయోగించి హెయిర్ ఫాల్ ను తగ్గించుకోవచ్చు. అలాగే చుండ్రు లేకుండా చేయొచ్చు. ముఖ్యంగా వీటిని ఉపయోగించి జుట్టు పొడుగ్గా పెరిగేలా చేయొచ్చు.

మెంతుల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు మూలాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అలాగే వెంట్రుకలు పగిలిపోయే, తెగిపోయే, జుట్టు రాలడాన్ని తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. 100 గ్రాముల మెంతుల్లో 23 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది నెత్తిమీద పీహెచ్ స్థాయిని సమతుల్యం చేయడానికి, నెత్తిమీద నూనె ఉత్పత్తిని నియంత్రించడానికి సహాయపడుతుంది. చుండ్రు, అధిక జిడ్డు వంటి సమస్యలను నివారించడానికి మెంతులు సహాయపడతాయి. చుండ్రు, జిడ్డు జుట్టు రాలడానికి కారణమవుతుంది.అలాగే జుట్టు పెరుగుదలను ఆపేస్తుంది.  మరి ఇందుకోసం మెంతులను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

Latest Videos

జుట్టు రాలడాన్ని తగ్గించడానికి మెంతులను ఎలా ఉపయోగించాలి..


ఒకటి: రెండు టీస్పూన్ల మెంతులను తీసుకుని  రాత్రంతా నీళ్లలో నానబెట్టండి. ఆ తర్వాత ఉదయాన్నే మెంతులను గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసుకోండి. ఈ మెంతి పేస్ట్ ను తలకు అప్లై చేసి 10 నిమిషాల పాటు మసాజ్ చేయండి. ఆ తర్వాత కొద్ది సేపు జుట్టును వదిలేసి షాంపూతో తలస్నానం చేయండి.

రెండు: రెండు టీ స్పూన్ల మెంతులను తీసుకుని రాత్రంతా నానబెట్టండి. మరుసటి రోజు ఉదయాన్నే మెంతులను పేస్ట్ లా వేసుకోండి. తర్వాత అందులో కొద్దిగా పెరుగు వేసి బాగా కలపండి.  ఈ ప్యాక్ ను తలకు అప్లై చేయండి. 20 నుంచి 30 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయండి. ఈ మెంతి హెయిర్ ప్యాక్ జుట్టును బలోపేతం చేయడానికి బాగా సహాయపడుతుంది.  జుట్టు మెరిసేలా కూడా చేస్తుంది. 

మూడు: ఒక గిన్నెలో నీళ్లు పోసి మరిగించండి. దీనిలో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె, రెండు టీస్పూన్ల మెంతులు వేసి కలపండి. ఇవి బాగా ఉడికిన తర్వాత ఈ నీటిని చల్లారనివ్వండి. తర్వాత ఈ నీటితో జుట్టును వాష్ చేయండి.

click me!