కలబంద గుజ్జులో తేనె కలిపి ముఖానికి రాస్తే ఏమౌతుంది..?

By ramya Sridhar  |  First Published Aug 24, 2024, 12:39 PM IST

కలబంద, తేనె రెండూ కలిపి ముఖానికి రాయడం వల్ల మన అందం రెట్టింపు అవుతుందట. మన ముఖంపై డెడ్ సెల్స్ తొలగించడంలో సహాయం చేస్తాయి. 


కలబందను మనం అందాన్ని పెంచుకోవడంలో రెగ్యులర్ గా వాడుతూనే ఉంటాం. జుట్టు కీ, చర్మానికీ.. అందాన్ని పెంచడంలో కలబంద కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే.. కలబందలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రాపర్టీలు పుష్కలంగా ఉంటాయి. అదేవిధంగా  తేననె కూడా మన చర్మాన్ని మాయిశ్చరైజింగ్ గా ఉంచడంలో సహాయం చేస్తుంది. తేనెలోనూ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రాపర్టీలు ఉంటాయి. ఇవి మొటిమల సమస్యను కూడా తగ్గించేస్తాయి. మరి.. ఈ రెండింటినీ కలిపి ముఖానికి రాయడం వల్ల  ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం..

కలబంద, తేనె రెండూ కలిపి ముఖానికి రాయడం వల్ల మన అందం రెట్టింపు అవుతుందట. మన ముఖంపై డెడ్ సెల్స్ తొలగించడంలో సహాయం చేస్తాయి. ముఖంపై ఫ్రీ రాడికల్స్ తొలగించడంలో సహాయపడతాయి. ఈ రెండూ కలిపి రాయడం వల్ల... ముఖం.. చాలా బాగా క్లెన్స్ అవుతుంది.

Latest Videos

undefined

అంతేకాదు... రెండూ కలిపి రాయడం వల్ల ముఖంలో గ్లో తీసుకువస్తుంది. ఈ రెండూ కలిపి రాయడం వల్ల.. ముఖానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దాని వల్ల చర్మానికి రిలాక్సేషన్ ఇస్తుంది. ఈ క్రమంలో.. ముఖంలో గ్లో పెరుగుతుంది.

ఇక.. చాలా మంది ముఖంపై మొటిమలు, మచ్చలు వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటివారు.. ఈ రెండూ కలిపి రాయడం వల్ల.. మొటిమలు తగ్గిపోవడమే కాదు, మొటిమల తాలుకూ మచ్చలు కూడా తొలగిపోవడానికి సహాయం చేస్తుంది. ఆయిల్ స్కిన్ కూడా.. నార్మల్ గా మారుతుంది.

అంతేనా... మీ వయసు తగ్గిపోతుంది. వయసు పెరిగినా.. ఆ ఛాయలు మీ ముఖంపై కనపడకుండా చేయడంలో ఈ రెండూ సహాయం చేస్తాయి. 
 

click me!