మీరు మీ జీవితంలోని ప్రత్యేకమైన స్త్రీ.. అమ్మ, చెల్లి, భార్య, స్నేహితురాలు ఇలా ఎవరైనా సరే.. వారికి మీరు ఈ ఉమెన్స్ డే రోజున బహుమతి ఇవ్వాలంటే.. ఈ కింది బెస్ట్ గిఫ్ట్ ని ట్రై చేయండి.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన మ జరుపుకుంటారు. ఒక స్త్రీ తన జీవితంలో చేస్తున్న కృషిని గుర్తించి.. ఈరోజు వారికి అందరూ ఈ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు. మీరు మీ జీవితంలోని ప్రత్యేకమైన స్త్రీ.. అమ్మ, చెల్లి, భార్య, స్నేహితురాలు ఇలా ఎవరైనా సరే.. వారికి మీరు ఈ ఉమెన్స్ డే రోజున బహుమతి ఇవ్వాలంటే.. ఈ కింది బెస్ట్ గిఫ్ట్ ని ట్రై చేయండి.
ఈ మహిళా దినోత్సవం రోజున మీ జీవితంలోని మహిళ వ్యక్తిత్వాన్ని బట్టి.. వారికి ఎలాంటి బహుమతి ఇస్తే బాగుంటుందో ఓసారి చూద్దాం..
undefined
1. కళా ప్రేమికులు..(artist)
ఆర్టిస్ట్ లకు ఆర్ట్ కి సంబంధించిన ఏ వస్తువులు బహుమతిగా ఇచ్చినా చాలా ఆనందపడతారు. వారికి బహుమతులు కొనడం చాలా సులువైన పని. మీ స్పెషల్ లేడీ కూడా ఈ కేటగిరికి చెందిన వారు అయితే... వారిని ఆశ్చర్యపరిచేందుకు రంగుల పాలెట్లు, యాక్రిలిక్ లేదా ఆయిల్ కలర్స్, పెయింట్ బ్రష్‌లు, స్కెచ్‌బుక్‌లు లేదా చార్కోల్ పెయింటింగ్ సామాగ్రిని కొనుగోలు చేయండి.
2. మేధావుల కోసం..
మీ జీవితంలోని స్త్రీ చాలా మేధావి అనే భావన మీకు ఉంటే... వారికి పుస్తకాలు చదివే అలవాటు ఉంటే.. వారికి నచ్చిన రచయిత పుసక్తాలను తీసుకువచ్చి వారికి బహుమతిగా ఇవ్వచ్చు. ఈ బహుమతి వారికి బాగా నచ్చుతుంది.
3. ప్రయాణ ప్రియుల కోసం..
ప్రయాణం చేయడానికి ఇష్టపడే, ఎల్లప్పుడూ ప్రయాణంలో ఉండే మహిళల కోసం.. ట్రావెల్ పిల్లోస్ , కస్టమైజ్డ్ పాస్‌పోర్ట్ కవర్లు, లగేజ్ బ్యాగ్ లేదా బహుళ ప్రయోజన బ్యాక్‌ప్యాక్‌లను ఇవ్వచ్చు.
4. బేకింగ్ ని ఇష్టపడే వారికోసం...
మీ జీవితంలోని ప్రత్యేక మహిళ బేకింగ్‌ను ఇష్టపడితే, మీరు వారికి కొత్త బేకింగ్ ఉపకరణాలు లేదా సాధనాలను కొనుగోలు చేసి వారికి బహుమతిగా ఇవ్వచ్చు. మీరు వారికి వంట పుస్తకాలు లేదా బేకింగ్ సెషన్‌ను బహుమతిగా ఇవ్వచ్చు. ఈ బహుమతి కూడా వారికి బాగా నచ్చుతుంది.
5. వర్కౌట్ ఫ్యానాటిక్స్ కోసం
తమ జిమ్ వర్కౌట్లు లేదా యోగాను ఇష్టపడే , తమను తాము ఆరోగ్యంగా , ఫిట్‌గా ఉంచుకోవడంపై దృష్టి సారించే మహిళలకు, చక్కని అథ్లెయిజర్ దుస్తులను, యోగా మ్యాట్లు, ఫిట్నెస్ గాడ్జెట్లు, సిప్పర్స్ లేదా కూల్ వర్కౌట్ షూలు వంటివి బహుమతిగా ఇవ్వాలి.
6. టెక్ పట్ల ఆసక్తి ఉన్నవారికి..
టెక్ పట్ల ఎక్కువ ఆసక్తి ఉన్నవారికి,సాంకేతిక పరిజ్ఞానం, వినియోగాన్ని ట్రెండ్‌లో ఉంచడానికి ఇష్టపడే మహిళలకు, వారి ఇష్టానుసారం స్మార్ట్ వాచీలు, ఇయర్ పాడ్లు, ఫిట్నెస్ బెల్ట్‌లు లేదా బ్లూటూత్ స్పీకర్లను బహుమతిగా ఇవ్వడం మంచిది.
7. బ్యూటీ హోర్డర్స్ కోసం
బ్యూటీ ప్రొడక్ట్స్ , మేకప్ చాలా మందికి బలహీనత కావచ్చు. మీ ప్రత్యేక మహిళ సౌందర్య ఉత్పత్తులను సేకరించడానికి మరియు నిల్వ చేయడానికి ఇష్టపడే వ్యక్తి అయితే, ఆమె బ్రాండ్ ప్రాధాన్యతల ప్రకారం ఆమెకు సరైన మేకప్ కిట్‌ను బహుమతిగా ఇవ్వండి. ఐషాడో ప్యాలెట్ల నుండి ఆకృతుల వరకు, లిప్ కలర్ షేడ్స్ నుండి నెయిల్ పెయింట్ల వరకు, ప్రతి అందం ఔత్సాహికులకు ఏదో ఒక వస్తువు ఉంటుంది.