కొంత సమయం విశ్రాంతి తీసుకున్న తర్వాత ఇంటి పనుల్లో భార్యకు సహాయం చేయాలి. దీని ద్వారా మీరు మీ భార్యపై మీకు ఎంత శ్రద్ధ , ప్రేమ ఉందో తెలియజేయవచ్చు. ఇంటి పనుల్లో సాయం చేసే భర్త భార్య మనసు దోచుకుంటాడు.
మార్చి 8న ప్రపంచ మహిళా దినోత్సవం. ప్రపంచ వ్యాప్తంగా మహిళలకు ఆరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతాయి. ఈ ఉమెన్స్ రోజున మీరు మీ భార్యపై మీరు ప్రేమ చూపించండి. రోజూ ప్రేమ చూపిస్తూనే ఉన్నాం కదా అనే సందేహం మీకు కలగొచ్చు. అయితే... ఈరోజున మరింత స్పెషల్ గా ప్రేమను తెలియజేయాలి. అదెలాగో ఓసారి చూద్దాం....
ఇంటి పనిలో సహాయం : భర్త బయట పని చేసేవాడు నిజమే. అలా అని ఇంట్లో భార్య ఖాళీగా కూర్చోదు. ఆమె ఇంటి పనులు కూడా చేస్తుంది. ఆఫీసులకు వెళ్లే మహిళల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. ఆఫీసు నుంచి వచ్చిన వెంటనే పని చేయాల్సిన అవసరం లేదు. కొంత సమయం విశ్రాంతి తీసుకున్న తర్వాత ఇంటి పనుల్లో భార్యకు సహాయం చేయాలి. దీని ద్వారా మీరు మీ భార్యపై మీకు ఎంత శ్రద్ధ , ప్రేమ ఉందో తెలియజేయవచ్చు. ఇంటి పనుల్లో సాయం చేసే భర్త భార్య మనసు దోచుకుంటాడు.
undefined
వంటగదిలో సమయం గడపడం: వంట చేయడం మహిళలకే పరిమితం అని చాలా మంది భావిస్తారు. కానీ పురుషులు కూడా వంట చేయవచ్చు. మీరు వంట చేయగలిగితే, మీ భార్య కోసం స్పెషల్ గా మీరే డిన్నర్ ప్రిపేర్ చేయండి. మీకు వంట రాకపోతే, మీ భార్యతో వంటగదిలో గడపండి. వంటగది కూడా శృంగారానికి గొప్ప ప్రదేశం అని గుర్తుంచుకోండి.
భార్యకు విలువైన సమయాన్ని కేటాయించండి : భార్యకు సమయం ఇవ్వడం చాలా ముఖ్యం. ఆఫీసులు, స్నేహితులతో బిజీబిజీగా ఉండే పురుషులు తమ భార్యలకు సమయం ఇవ్వరు. కానీ కుటుంబంతో సమయం గడపడం చాలా ముఖ్యం. మీరు మీ భార్యతో బయటకు వెళ్లలేకపోతే, ఇంట్లో గడపండి.
క్షమాపణ చెప్పడం: మనకు తెలియకుండానే తప్పులు చేస్తాం. తప్పులకు క్షమాపణ చెప్పడం చాలా ముఖ్యం. మీరు తప్పు చేస్తే, మీ భార్యకు క్షమాపణ చెప్పండి. ఇది భార్య విసుగు, కోపాన్ని తగ్గిస్తుంది.
థ్యాంక్స్ చెప్పడం : చాలామంది మహిళలు చేసే పనిని సీరియస్‌గా తీసుకోరు. మీ పని సులువు అని పురుషులు వారిని చాలా తేలికగా తీసుకుంటూ ఉంటారు. కానీ అన్ని బాధ్యతలు నిర్వహించడం కష్టం. మీ భార్య ఏదైనా మంచి చేసినప్పుడు లేదా మీకు సహాయం చేసినప్పుడు ఆమెకు ధన్యవాదాలు చెప్పడం అలవాటు చేసుకోవాలి. ఈ విధంగా కూడా మీరు మీ భార్యకు మీ ప్రేమను తెలియజేయవచ్చు.