ఇక మొబైల్, కంప్యూటర్ నుంచి వచ్చే వెలుతురూ చర్మాన్ని డల్ గా మార్చేస్తాయి. కాబట్టి కాలంతో సంబంధం లేకుండా స్కిన్ కేర్ లో సన్ స్క్రీన్ ఉండాల్సిందే.
నిన్న, మొన్నటి వరకు బయట ఎండలు మండిపోయాయి. ఆ ఎండలకు కాసేపు బయటకు వెళ్లినా.. ట్యాన్ వచ్చేసేది. ఎందుకంటే... ఎండకి ట్యాన్ పట్టేస్తుంది. యూవీ కిరణాలు చర్మంపై ప్రభావం చూపి ముడతలు, గీతలకు కారణమవుతాయని సన్ స్క్రీన్ రాస్తాం. కానీ ఇప్పుడు వాతావరణం మారిపోయింది. ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. చినుకులు తరచూ పలకరిస్తున్నాయి. వాతావరణం హాయిగా మారగానే మనకు సన్ స్క్రీన్ గుర్తుకు కూడా రాదు. అసలు.. వర్షాకాలంలో సన్ స్క్రీన్ అవసరం లేదు అని చాలా మంది ఫీలౌతారు. మీరు కూడా అలానే అనుకొని రాయడం ఆపేశారా? అయితే ప్రమాదం కొని తెచ్చుకుంటున్నట్లే....
సూర్యుడే కనిపించట్లేదు కానీ యూవీ కిరణాల ప్రభావం ఉంటుంది. ఇక మొబైల్, కంప్యూటర్ నుంచి వచ్చే వెలుతురూ చర్మాన్ని డల్ గా మార్చేస్తాయి. కాబట్టి కాలంతో సంబంధం లేకుండా స్కిన్ కేర్ లో సన్ స్క్రీన్ ఉండాల్సిందే.
undefined
వర్షంలో తడిచామంటే పోతుంది కాబట్టి, ఈ కాలం వాటర్ ప్రూఫ్ దే వాడాలి. యూవీఏ, యూవీబీ నుంచి ప్రొటెక్షన్ అందిస్తోందా అనేదీ చూసుకోవాలి. అలాగే ఒక్కసారి రాస్తే సరిపోతుంది అనీ అనుకోకూడదట. మూడు నాలుగు గంటలకు ఓసారి తిరిగి రాయాలి కూడా.
క్రీమ్ రాస్తే సరిపోదు. దాని ప్రయోజనమూ అందాలి కదా... అందుకే రాసే విధానమూ సరిగా ఉండాలి. పెద్ద బఠాణి గింజ పరిమాణంలో తీసుకుని రాయాలి. మెడ, చెవులకీ రాయాలి. అప్పుడే ముఖమంతా ఒకే రంగులో కనిపిస్తుంది.
మేకప్ రాస్తున్నప్పుడు అక్కర్లేదు అనుకోవద్దు. మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ రాశాకే ఫౌండేషన్ రాయాలి. సన్ స్క్రీన్ చర్మంలోకి ఇంకింది అనిపించాకే మేకప్ వరకూ వెళ్లాలి. కాబట్టి చల్లగా ఉంది, చర్మం సురక్షితం అని సన్ స్క్రీన్ ని అశ్రద్ధ చేయకండి. ఎండే లేదు. ప్రమాదం అలాగే ఉంది.