తమ్ముడి పెళ్లిలో.. ఇషా అంబానీ వేసుకున్న నెక్లెస్ పైనే అందరి కళ్లు.. దీని ప్రత్యేకత ఏంటంటే?

By Shivaleela Rajamoni  |  First Published Jul 13, 2024, 12:40 PM IST

అంబానీ ఇంట్లో పెళ్లి సందడి మామూలు రేంజ్ లో లేదు. ఈ కుబేరుడి ఇంట్లో పెళ్లికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులంతా హాజరయ్యారు. ఇక ఈ పెళ్లిలో అంబానీ ఫ్యామిలీ చాలా స్పెషల్ గా కనిపించింది. వీరిలో ఇషా అంబానీ వేసుకున్న నెక్లెస్ పైనే అందరి కళ్లు.. దీని స్పెషల్ ఏంటో తెలుసా? 


మన దేశ కుబేరుడి ఇంట్లో పెళ్లి సందడి ఓ రేంజ్ లో ఉంది. నిన్నే అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి బాలీవుడ్, టాలీవుడ్, సినీ ప్రముకులు, రాజకీయ నాయకుల నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులంతా  హాజరయ్యారు. ఇక వీరికి ఎక్కడా తగ్గకుండా.. అతిథి మర్యాదలు ఏర్పాటు చేశారు. అంబానీ వారి పెళ్లి గురించి ఎక్కడ చూసినా హాట్ టాపిక్ గా మారింది. 

అనంత్, రాధిక ల వివాహానికి అంబానీ ఆడపడుచులు ఎంత స్పెషల్ గా రెడీ అయ్యారో వారి ఫోటోలను చూస్తేనే అర్థమవుతుంది. అందులోనూ సోదరుడి పెళ్లికి ఇషా అంబానీ చాలా బ్యూటీ ఫుల్ లుక్ లో కనిపించింది. ముఖ్యంగా ఆమె ధరించిన నెక్లెస్ తెగ వైరల్ అవుతోంది. ప్రతి పెళ్లి వేడుకలోనూ ఇషా ఫ్యాషన్ సెన్స్ ను జనాలు బాగా ఇష్టపడతారు. తల్లి నీతా అంబానీ మాదిరిగానే రంగ్ఘాట్ ఘఘ్రాలో ఇషా అంబానీ రెడీ అయ్యింది. ఇక ఈ ఘాఘ్రాలో మరింత అందంగా కనిపించేలా ఒక అందమైన నెక్లెస్ ను ధరించింది. ఈ నెక్లెస్ పైనే అందరి కళ్లు నిలిచాయి. అంత ప్రత్యేకత ఉంది మరి ఈ నెక్లెస్ కు. రంగురంగుల ప్రత్యేకమైన వజ్రాలతో తయారు చేసిన ఈ నెక్లెస్ ప్రత్యేకత ఏంటో ఓ లుక్కేద్దాం పదండి. 

Latest Videos

undefined

తమ్ముడి పెళ్లిలో ఇషా అంబానీ వేసుకున్న ఈ నెక్లెస్ పీస్ లో చాలా అరుదైన పింక్, బ్లూ, గ్రీన్, ఆరెంజ్ రంగుల వజ్రాలు పొదగబడ్డాయి. ఈ నెక్లెస్ కు గార్డెన్ ఆఫ్ లవ్ అనే పేరు పెట్టారు. ఈ అందమైన నెక్లెస్ ను తయారు చేయడానికి ఏకంగా 4000 గంటల సమయం పట్టిందట. 

ఈ అందమైన నెక్లెస్ మధ్యలో హార్ట్ షేప్ లో ఉన్న నీలం రంగు వజ్రం త్రెడ్ చేయబడింది. దీని చుట్టూ పోర్ట్రెయిట్ కట్ చేసిన వజ్రాలు ఉన్నాయి. వజ్రంతో తయారు చేసిన చిన్న చిన్న పువ్వులతో దీన్ని తయారుచేశారు. ఈ నెక్లెస్ కు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే? తెల్లని పోర్ట్రెయిట్ కట్ చేసిన వజ్రాలను చూస్తే అవి రంగురంగుల నిప్పుల్లా కనిపిస్తాయి. దీనిపై సీతాకోకచిలుకలు ఎగురుతున్నట్టుగా కనిపిస్తుంది. 

click me!