వంటింట్లో వంట చేసేటపపుడు దుస్తులపై నూనె, మసాలాల మరకలు పడుతుంటాయి. కానీ ఈ నూనె మరకలు అంత సులువుగా పోవు. కానీ మీరు కొన్ని చిట్కాలను ఫాలో అయితే మాత్రం ఈ మరకలను చాలా సులువుగా పోగొట్టొచ్చు. అదెలాగంటే?
బట్టలపై మరకలుండటం సర్వ సాధారణం. ఏదో ఒక విధంగా బట్టలపై మరకలు పడుతూనే ఉంటాయి. ముఖంగా వంట చేసేటప్పుడు, నూనె, మసాలా మరకలు ఎక్కువగా పడుతుంటాయి. ఈ మరకలను అలాగే వదిలేస్తే ఇక పోనే పోవు. ఈ మరకలను సాధారణ డిటర్జెంట్లను ఉపయోగించి పోగొట్టలేం. అలాగే ఎక్కువగా రుద్దితే బట్టలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కానీ రూపాయి ఖర్చు చేయకుండా ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో ఈ మొండి మరకను పోగొట్టొచ్చు. అదెలాగంటే?
వెనిగర్
వెనిగర్ నూనె మరకలను పోగొట్టడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. మీ బట్టలపై నూనె మరకలు పడి, వింత వాసన వస్తుంటే వెనిగర్ ను ఉపయోగించి క్లీన్ చేయండి. వెనిగర్ తో నూనె మరకలను పోగొట్టడానికి దీన్ని గోరువెచ్చని నీటిలో కలపండి. అలాగే నూనె మరకలు పడ్డ భాగాన్ని దీనిలో నానబెట్టండి. కాసేపటి తర్వాత చేతులతో రుద్దితే నూనె మరకలు కనిపించకుండా పోతాయి. వెనిగర్ జిడ్డు మరకను సులభంగా శుభ్రపరుస్తుంది.
నిమ్మకాయ..
నిమ్మకాయ నూనె మరకలను పోగొట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. నిమ్మకాయ నేచురల్ బ్లీచింగ్ లా పనిచేస్తుంది. బట్టలపై నూనె మరకలు పడ్డప్పుడు ఒక చిన్న నిమ్మకాయ ముక్కను కట్ చేసి దాని రసాన్ని మరకపై పిండండి. తర్వాత చేతులతో తేలికగా రుద్దండి. దీనివల్ల మరక మసకబారడం ప్రారంభమవుతుంది. 0
టాల్కమ్ పౌడర్..
బట్టలపై పడ్డ నూనె మరకలను పోగొట్టడానికి మీరు టాల్కమ్ పౌడర్ ను కూడా ఉపయోగించొచ్చు. ఇందుకోసం నూనె పడిన వెంటనే ఆ ప్రదేశంలో టాల్కం పౌడర్ ను వేయండి. ఇలా 20 నుంచి 30 నిమిషాల పాటు దాన్ని అలాగే ఉంచండి. టాల్కమ్ పౌడర్ గుడ్డపై పడే నూనెను పూర్తిగా గ్రహిస్తుంది. ఒకవేళ బట్టపై ఎక్కువ నూనె పడినట్టైతే పొడిగా లేదా తడిగా ఉన్న తర్వాత స్క్రబ్ చేయండి. కనీసం 30 నిమిషాల తర్వాత డిటర్జెంట్ ఉపయోగించి తేలికగా చేతులతో రుద్ది క్లీన్ చేయండి. దీంతో మరకలు పూర్తిగా తొలగిపోతాయి.
బేకింగ్ సోడా
మసాలా దినుసుల మరకలను తొలగించడంలో బేకింగ్ సోడా కూడా బాగా సహాయపడుతుంది. బేకింగ్ సోడాతో బట్టలపై ఉన్న మొండి మరకలను తొలగించడానికి బట్టను తడిపి, సరైన మొత్తంలో బేకింగ్ సోడాను మరకలు ఉన్న ప్రదేశంలో వేయండి. ఇది బట్టలపై ఉన్న నూనె మరకలను పూర్తిగా గ్రహిస్తుంది. ఆ తర్వాత సాధారణ పద్ధతిలో డిటర్జెంట్ ను ఉపయోగించి క్లీన్ చేయండి.