ముఖంపై వెంట్రుకలున్నాయా? పోవాలంటే ఇలా చేయండి

By Shivaleela Rajamoni  |  First Published Jul 4, 2024, 1:47 PM IST

చాలా మంది అమ్మాయిలకు గడ్డం, పెదవుల పైన అవాంచిత వెంట్రుకలు ఉంటాయి. వీటిని చాలా మంది ఎగతాలి చేస్తుంటారు. వీటిని తొలగించేందుకు షేవింగ్ చేస్తుంటారు చాలా మంది. కానీ ఇలా అస్సలు చేయకూడదు. మరి నేచురల్ గా ఈ వెంట్రుకలు పూర్తిగా పోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 


ముఖంపై ఉండే అవాంఛిత వెంట్రుకల వల్ల ఇబ్బంది పడే అమ్మాయిలు చాలా మందే ఉన్నారు. ఈ వెంట్రుకల వల్ల అందం తగ్గుతుంది. ముఖ్యంగా చాలా మంది  అబ్బాయి లాగే ఉన్నావని వెక్కిరిస్తుంటారు. ఇంకేముంది ఈ వెంట్రుకలను తొలగించాలని షేవింగ్ చేయడం, మార్కెట్ లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ ను వాడుతూ ఇబ్బంది పడుతుంటారు. కానీ ముఖంపై ఉండే ఈ అవాంఛిత వెంట్రుకలను తొలగించడానికి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ గా ఈ వెంట్రుకలను ఎలా పోగొట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

ఆలం, రోజ్ వాటర్: ముఖంపై ఉండే అవాంఛిత రోమాల వల్ల ముఖం రూపు చాలా వరకు మారుతుంది. దీనికి తోడు అబ్బాయి అబ్బాయి అని వెక్కిరిస్తుంటారు చాలా మంది. అయితే మీరు ఈ వెంట్రుకలు పూర్తిగా పోయేందుకు ఆలం, రోజ్ వాటర్ ను వాడొచ్చు. ఈ రెండింటిని వాడటం వలల్ ఈ వెంట్రుకలు క్రమంగా తగ్గిపోతాయి. ఇందుకోసం రెండు టీ స్పూన్ల ఆలం పొడిని తీసుకుని, 4 టీ స్పూన్ల రోజ్ వాటర్, 4 చుక్కల నిమ్మరసం, చిటికెడు పసుపును తీసుకోండి. 

Latest Videos

ముందుగా ఆలంను  గ్రైండ్ చేసి పొడిలా చేసుకోండి. ఇప్పుడు తీనిలో రోజ్ వాటర్, నిమ్మరసం, పసుపు వేసి బాగా కలపండి. ముందుగా మంచి క్లెన్సర్ లేదా ఫేస్ వాష్ సహాయంతో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేయండి.

ఈ పేస్ట్ పూర్తిగా ఆరేముందు వృత్తాకార కదలికలో ఫేస్ ను మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల పేస్ట్ ముఖం నుంచి తొలగిపోతుంది. ఈ పేస్ట్ ను మీరు వారానికి రెండుసార్లైనా అప్లై చేయాలి. ఈ పద్దతిలో ముఖంపై వెంట్రుకలను ఈజీగా తొలగించొచ్చు. ఈ ప్యాక్ ను క్లీన్ చేసిన తర్వాత మర్చిపోకుండా ముఖానికి మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి. ఎందుకంటే పొడిబారిన చర్మాన్ని తేమగా చేస్తుంది. 
 

click me!