శెనగపిండిలో ఇదొక్కటి కలిపి వాడితే మీ ముఖం ఎంత అందంగా మెరుస్తుందో..!

By Shivaleela Rajamoni  |  First Published Jul 5, 2024, 11:09 AM IST

శెనగపిండిని మనం ఎన్నోవంటల్లో ఉపయోగిస్తుంటాం. ఈ శెనగపిండిని ఒక్క ఆహారాల్లోనే కాదు అందానికి కూడా ఉపయోగించొచ్చు. అవును ఈ పిండిని ఉపయోగించి ముఖాన్ని అందంగా చెయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


ఇండియాలో చాలా మంది చర్మాన్ని శుభ్రం చేయడానికి ఎన్నో ఏండ్లుగా శెనగపిండిని ఉపయోగిస్తున్నారు. ఈ పిండితో తయారుచేసిన ఫేస్ ప్యాక్ ను అందాన్ని మెరుగుపర్చడానికి బాగా ఉపయోగిస్తారు. ఈ ఫ్యాక్ ముఖంపై మొటిమలను, మచ్చలను పోగొట్టడానికి బాగా పనిచేస్తుంది. అలాగే ఇది ముఖం అందంగా మెరిసేలా కూడా చేస్తుంది. ఇందుకోసం శెనగపిండిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

చర్మానికి శెనగపిండి

Latest Videos

శెనగపిండితో ముఖాన్ని శుభ్రం చేయొచ్చు. ఈ పిండి ముఖంపై మురికిని, దుమ్ము, ధూళిని తొలగించడానికి, అదనపు ఆయిల్ ను తొలగించడానికి, వివిధ చర్మశుద్ది సమస్యలను వదిలించుకోవడానికి బాగా సహాయపడుతుంది. 

శెనగపిండి, పెరుగు

శెనగపిండిని, పెరుగును కలిపి వాడితే ముఖం అందంగా మారుతుంది. మీ ముఖం కాంతివంతంగా మారాలంటే శెనగపిండిలో పెరుగును కలిపి ముఖానికి అప్లై చేయండి. ఈ ఫేస్ ప్యాక్ ను ఉపయోగించడం వల్ల మొటిమలు, బ్లాక్ హెడ్స్, మచ్చలు తగ్గుతాయి. 

శెనగపిండి ప్యాక్ ఎలా తయారు చేయాలి?

శెనగపిండి ఫేస్ ప్యాక్ ను తయారుచేయడానికి.. 2 నుంచి 3 టీస్పూన్ల శెనగపిండిని తీసుకుని దానిలో 2 టీస్పూన్ల పెరుగును వేసి కలపండి. ఈ ప్యాక్ లో తేనె, పసుపు వేసి అన్నింటినీ బాగా కలపండి. దీన్ని మీ ముఖానికి అప్లై చేయండి. ఈ శెనగపిండి, పెరుగు ఫేస్ ప్యాక్ ను వారానికి 1-2 సార్లు అప్లై చేయడం వల్ల మీ ముఖం కాంతివంతంగా మారుతుంది.

శెనగపిండి, పచ్చి పాలు

మీ ముఖ చర్మం ప్రకాశవంతంగా, మృదువుగా ఉండటానికి.. శెనగపిండిలో పచ్చి పాలను కలిపి వాడితే మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ముఖంపై ఉండే నల్ల, తెల్ల మచ్చలను పోగొట్టడానికి సహాయపడుతుంది. ఈ ప్యాక్ ను తయారుచేయడానికి 2 టీస్పూన్ల శెనగపిండిలో 3-4 టీస్పూన్ల పచ్చి పాలను వేసి కలపండి. దీనిలో కొద్దిగా రోజ్ వాటర్, అలోవెరా జెల్ ను కలపండి. ఈ ఫేస్ ప్యాక్ ను మీ ముఖానికి, మెడ మొత్తానికి అప్లై చేయండి. మంచి ఫలితాల కోసం ఈ ప్యాక్ ను వారానికి 1-2 సార్లు అప్లై చేయండి. 

click me!