ఆ సమయంలో వ్యాక్సిన్ వేయించుకోవచ్చా..?

By telugu news team  |  First Published Apr 27, 2021, 10:19 AM IST

వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కనీసం మూడు నెలలు పిల్లల కోసం ప్రయత్నించకూడదని కూడా చెప్పారు. అయితే.. మరి మహిళలు, యువతులు నెలసరి సమయంలో వ్యాక్సిన్ వేయించుకోవచ్చా..? దాని వల్ల ఏదైనా ప్రమాదం ఉందా..? ఈ అనుమానం చాలా మందిలో ఉంది. ఈ నేపథ్యంలో.. దీనిపై నిపుణులు క్లారిటీ ఇచ్చారు.


కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేసేస్తోంది. నువ్వు, నేను..పెద్దా, చిన్నా అనే తేడా లేకుండా అందరినీ కాటేస్తోంది. కొందరు ఈ వైరస్ ధాటికి తట్టుకోలోక ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. దీనిని కట్టడి చేయాలంటే అందరూ వ్యాక్సిన్ వేయించుకోవడం ఒక్కటే మార్గమని ప్రభుత్వాలు చెబుతున్నాయి. పెద్ద ఎత్తున వ్యాక్సిన్ డ్రైవ్ లు కూడా నిర్వహిస్తూ.. ప్రజలను చైతన్య పరుస్తున్నారు.

అయితే.. ఈ వ్యాక్సిన్ విషయంలో చాలా మందికి అనుమానాలు కలుగుతున్నాయి. చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు వేయించుకోకూడదంటూ ఇప్పటికే చెప్పేశారు. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కనీసం మూడు నెలలు పిల్లల కోసం ప్రయత్నించకూడదని కూడా చెప్పారు. అయితే.. మరి మహిళలు, యువతులు నెలసరి సమయంలో వ్యాక్సిన్ వేయించుకోవచ్చా..? దాని వల్ల ఏదైనా ప్రమాదం ఉందా..? ఈ అనుమానం చాలా మందిలో ఉంది. ఈ నేపథ్యంలో.. దీనిపై నిపుణులు క్లారిటీ ఇచ్చారు.

Latest Videos

undefined

మహిళల రుతుస్రావానికి కరోనా వ్యాక్సిన్ ఎలాంటి అడ్డు కాదని నిపుణులు చెబుతున్నారు. పీరియడ్స్ సమయంలో వ్యాక్సిన్ వేయించుకోకూడదు అనేది కేవలం భ్రమ, పుకార్లు మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. నెలసరికీ, వ్యాక్సిన్ కి ఎలాంటి సంబంధం ఉండదని చెబుతున్నారు. కాబట్టి ఎలాంటి సదేహం లేకుండా పీరియడ్స్ సమయంలో నైనా వ్యాక్సిన్ తీసుకోవచ్చని చెబుతున్నారు.

అంతేకాకుండా.. వ్యాక్సిన్ వేయించుకుంటే మాంసాహారం తినొచ్చా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కూడా నిపుణులు క్లారిటీ ఇచ్చారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆరోగ్యకరమైన ఆహారం ఏదైనా తీసుకోవచ్చు అని చెబుతున్నారు. ఇక మొన్నటి వరకు బాలింతలు వ్యాక్సిన్ వేయించుకునేవారు కాదు.. కానీ ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం.. వారు కూడా వ్యాక్సిన్ వేయించుకోచ్చు. అది బిడ్డకు ఎలాంటి హాని కలిగించదు. 

అయితే.. వ్యాక్సిన్ అనంతరం రక్తదానం చేయడానికి కొంత విరామం తీసుకోవాలి. వెంటనే ఇవ్వకూడదు. కాబట్టి రక్తం ఇవ్వాలనుకునేవారు ముందుగానే ఇస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 

click me!