రోజూ రైడ్ వైన్.. మెరిసే అందం మీ సొంతం

By telugu news teamFirst Published Jun 29, 2020, 11:37 AM IST
Highlights

రెడ్‌వైన్‌లోని ప్రత్యేక గుణాలు రోగ నిరోధక శక్తిని పెంచి వృద్ధ్యాప్య ఛాయలను దూరం చేస్తాయి.

మద్యపానం ఆరోగ్యానికి హానికరం ఇది మనకు తెలిసిన విషయమే... కానీ.. రెడ్ వైన్ విషయంలో మాత్రం ఇది వర్తించదని నిపుణులు  చెబుతున్నారు. రెడ్ వైన్ తాగడం వల్ల మనకు ఆరోగ్యంతో పాటు.. చర్మ సౌందర్యం కూడాచ సొంతమౌతుందని నిపుణులు చెబుతున్నారు.

రెడ్ వైన్ వల్ల దంత వ్యాధులు, బరువు తగ్గించుకోవడం, మతిమరుపును నుండి ఉపశమనం పొందడం కొన్ని రకాల క్యాన్సర్ నుండి రక్షణ పొందడానికి రెడ్ వైన్ గ్రేట్ గా సహాయపడుతుంది .

రెడ్‌వైన్‌లోని ప్రత్యేక గుణాలు రోగ నిరోధక శక్తిని పెంచి వృద్ధ్యాప్య ఛాయలను దూరం చేస్తాయి.

- రెడ్ వైన్ లో ఉండే రెస్వెట్రాల్ ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గిస్తుంది. రక్తంలో ఇన్సులిన్ నిరోధకత వల్ల టైప్ 2డయాబెటిస్ ప్రధాన కారకంగా చెప్పవచ్చు. అందుచేత రెడ్ వైన్ టైప్ 2 డయాబెటిస్ నిరోధించడానికి సహాయపడుతుంది.

- రెడ్ వైన్ జుట్టును మందంగా పెరిగేలా చేయడం, మీకు మందపాటి, మరియు మెరిసేటి కేశాలకు పొందాలంటే, రెడ్ వైన్ తో తలారా పోసుకోవాల్సిందే.

- రెడ్‌వైన్‌ తీసుకోవడం వలన మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుందనీ, ఇది గుండెను ఆరోగ్యంగా వుంచుతుందని పరిశోధనలో తేలింది.

- వైన్ ఉపయోగించిన తర్వాత మొటిమలను నివారించడానికి బాగా సహాయపడుతుంది . అంతే కాదు ఇది మొటిమలకు కారణం అయ్యే ఫ్రీరాడికల్స్ డ్యామేజ్ అరికట్టడానికి వ్యతిరేఖంగా పోరాడుతుంది.

- మితంగా తీసుకొనే రెడ్ వైన్ వల్ల లంగ్ క్యాన్సర్ రిస్క్ ఉండదు. మరియు లంగ్స్ ఆరోగ్యంగా పనిచేయడానికి సహాయపడుతుంది.

- మెరిసేటి మరియు క్లియర్ స్కిన్ సహజంగా పొందడానికి, రెడ్ వైన్ తో ప్రతి రోజూ ముఖాన్ని పది నిముషాలు మసాజ్ చేయాలి. దీని వల్ల మంచి రిజల్ట్ పొందుతారు.

- మెదడులో కణాలు డ్యామేజ్ ను అరికట్టడానికి రెడ్ వైన్ గ్రేట్ గా సహాయపడుతుందని కొన్ని పరిశోధన ద్వారా వెల్లడి చేయడం జరిగింది . బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ ను నివారిస్తుందని, దాంతో అల్జీమర్స్ ను కూడా దూరం చేస్తుంది.

- డ్రై రెడ్ వైన్ మీ చర్మం మీద డైరెక్ట్ గా ఉపయోగించవచ్చు. ఇది మీ చర్మానికి టోనింగ్ గా మరియు మృదువైన చర్మ సౌందర్యాన్ని అందిస్తుంది.

click me!