లాక్ డౌన్ వేళ.. ఇంట్లోనే అందంగా..

By telugu news team  |  First Published Apr 16, 2020, 2:05 PM IST
కేవలం ఇంట్లో లభించే వస్తువులతో అంతకు మించి అందంగా మెరిసిపోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
 


ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా దేశమంతా లాక్ డౌన్ నడుస్తోంది. అయితే.. ఈ లాక్ డౌన్ కారణంగా ముఖ్యంగా స్త్రీలు తెగ బాధపడిపోతున్నారని.. బ్యూటీ పార్లర్ కి వెళ్లలేకపోవడం వల్ల తమ అందం పోయిందని ఏడుస్తున్నారంటూ సోషల్ మీడియాలో తెగ మీమ్స్ వస్తున్నాయి.

అయితే.. నిజానికి అమ్మాయిలకు, బ్యూటీ పార్లర్ లకు విడదీయలేని సంబంధం ఉందన్న మాట నిజమే. అయితే.. అవి లేనంత మాత్రాన అందంగా తయారు కాలేరు అని చెప్పడం మాత్రం అబద్ధం. కేవలం ఇంట్లో లభించే వస్తువులతో అంతకు మించి అందంగా మెరిసిపోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

ఓట్స్‌, తేనె, యోగర్ట్‌ కలిపిన మిశ్రమాన్ని ముఖం మీద  స్క్రబ్బర్‌లా రుద్దుకోవాలి. ఇలాచేస్తే మృతకణాలు తొలగిపోతాయి. చర్మం తాజాగా, నిగారింపుతో కనిపిస్తుంది. లేదంటే ఎర్ర కంది పప్పును రాత్రంతా నానబెట్టి, పొద్దున్నే పేస్ట్‌లా చేసుకొని ముఖానికి ఫేస్‌మాస్క్‌లా రాసుకున్నా ముఖం వెలిగిపోతుంది. 

బ్లాక్‌ టీని కురులకు పట్టిస్తే, జుట్టు పట్టులా మెరుస్తూ కనిపిస్తుంది. వారంలో రెండు సార్లు షాంపూతో తలస్నానం చేసిన తరువాత ఇలాచేస్తే ఫలితం ఉంటుంది.

గోళ్లు అందంగా మెరవాలంటే... గోళ్ల చివర్లో ఉన్న మృతకణాలను తొలగించి, బాదం నూనె లేదా కొబ్బరి నూనెతో పాలిష్‌ చేయాలి. దాంతో గోళ్ల దగ్గరి చర్మానికి పోషణ లభిస్తుంది
click me!