అమ్మాయిలూ సోలో ట్రిప్ కి వెళ్లాలని ఉందా..? బెస్ట్ ప్లేసెస్ ఇవే..!

By telugu news team  |  First Published Mar 29, 2023, 4:10 PM IST

ఎలాంటి భయం లేకుండా భారతదేశంలోని కొన్ని పర్యాటక ప్రదేశాలకు ఒంటరిగా ప్రయాణించవచ్చు. ఈ ప్రదేశాలలో మహిళలు సురక్షితంగా ఉంటారు. 


దేశాన్ని చుట్టిరావాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. అది అమ్మాయిలు అయినా కావచ్చు. అబ్బాయిలు అయినా కావచ్చు. చేతిలో కొంచెం డబ్బు ఉంటే... అబ్బాయిలు తమ కోరికను తీర్చుకోగలరు. కానీ అమ్మాయిలు అలా కాదు. అమ్మాయిలు ఒంటరిగా బయటకు అడుగుపెట్టాలి అంటే చాలా ఆంక్షలు ఉంటాయి. వారికి ఏదైనా జరగకూడనిది జరుగుతుందేమో అని భయపడుతూ ఉంటారు. అయితే...
ఎలాంటి భయం లేకుండా భారతదేశంలోని కొన్ని పర్యాటక ప్రదేశాలకు ఒంటరిగా ప్రయాణించవచ్చు. ఈ ప్రదేశాలలో మహిళలు సురక్షితంగా ఉంటారు. ఎక్కువగా  ఆనందించవచ్చు. అలాంటి ప్రదేశాలేంటో ఓసారి చూద్దాం..


జైసల్మేర్, రాజస్థాన్: భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో రాజస్థాన్ ఒకటి. సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ రాష్ట్రంలో చారిత్రక కోటలు, రాజభవనాలు, దేవాలయాలు, సరస్సులను ఇక్కడ చూడవచ్చు. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో మహిళలు సురక్షితంగా సంచరించవచ్చు. దీనిని గోల్డెన్ సిటీ అంటారు. జైసల్మేర్‌లో మహిళలు తిరిగేందుకు చాలా స్థలాలు , అనేక కార్యకలాపాలు, స్థానిక మార్కెట్‌లు షాపింగ్ చేయడానికి అనువైనవి.

Latest Videos

undefined

ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీ హిల్: ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీకి మహిళలు కూడా ఒంటరిగా ప్రయాణించవచ్చు. మీరు డెహ్రాడూన్ నుండి బస్సు లేదా టాక్సీలో ముస్సోరీకి చేరుకోవచ్చు. అక్కడ హోటల్ లేదా గదిని బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ మహిళలు ఎలాంటి భయం లేకుండా సంచరించవచ్చు. ఇక్కడ మీరు కాంప్టి జలపాతం, దలై హిల్స్, మాల్ రోడ్, ధలౌటి మొదలైన ప్రదేశాలను సందర్శించవచ్చు. తక్కువ ఖర్చుతో రెండు రోజుల పర్యటన చేయవచ్చు.

వారణాసి, ఉత్తరప్రదేశ్: హిందువులకు పవిత్ర స్థలం, వారణాసి ఉత్తరప్రదేశ్‌లోని పురాతన నగరం. ఇక్కడ గంగా నది  చూడటం ఖచ్చితంగా పూర్వ జన్మ పుణ్యం. ఇక్కడ బోటింగ్ కూడా చేయవచ్చు. కాశీ విశ్వనాథుని దర్శనం కూడా పొందవచ్చు. ఒంటరిగా ప్రయాణించాలనుకునే మహిళలకు ఈ ఆకర్షణ అనువైనది.

ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్: ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ ఆహ్లాదకరమైన వాతావరణం, హిల్ స్టేషన్‌లతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. ప్రకృతి ప్రేమికులకు ఇది స్వర్గం. ట్రెక్కింగ్, బోటింగ్ , షాపింగ్ చేయడానికి ఇది అనువైన ప్రదేశం. నైని సరస్సు, నైనా దేవి ఆలయం, జూ కూడా ఇక్కడ చూడవచ్చు.

దేశంలోని ప్రసిద్ధ హిల్ స్టేషన్ల జాబితాలో నైనిటాల్ చేర్చారు. చాలా మంది పర్యాటకులు శీతాకాలం, వేసవి కాలంలో నైనిటాల్‌ను సందర్శిస్తారు. ఒంటరిగా నైనిటాల్ వెళ్లాలనుకునే మహిళలు బస్సు లేదా రైలులో నైనిటాల్ చేరుకోవచ్చు. నైనిటాల్ చేరుకున్న తర్వాత, మహిళలు నిర్భయంగా అక్కడి నగరాల్లో తిరగవచ్చు.

click me!