కిచెన్ లో రకరకాల స్టీల్ డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాలతో పాటుగా ఎన్నో వస్తువులు ఉంటాయి. పోపు దినుసులు, ఉప్పు, పసుపు, కారం పొడి వంటి వంట సామానును డబ్బాల్లో నిల్వ చేస్తాం. కానీ వంటింట్లో ఉండే ప్రతి డబ్బా మురికిగా, జిగటగా మారుతుంది. ఈ జిగట పోవాలంటే ఏం చేయాలో తెలుసా?
కిచెన్ రూం చాలా నీట్ గా, ఆర్గనైజ్ గా ఉండాలి అని ప్రతి ఒక్క మహిళా కోరకుంటుంది. అందుకే ఇంట్లో అన్ని రూముల కంటే కిచెన్ పరిశుభ్రతపైనే ఎక్కువ ఫోకస్ పడుతుంది. కానీ కిచెన్ ను ప్రతి రోజూ క్లీన్ చేసినా.. మళ్లీ మురికిగానే కనిపిస్తుంది. దీన్ని ఏం క్లీన్ చేసినా దండగే అని చాలా సార్లు అనిపిస్తుంది. అలాగని వదిలేస్తే కిచెన్ మరింత దరిద్రంగా మారుతుంది. ముఖ్యంగా కిచెన్ రూం లో ఉండే డబ్బాలైతే స్టికీగా మారుతాయి. మీరు గమనించారో లేదో కానీ.. చికెన్ ఉండే ప్రతి డబ్బా జిగటగానే కనిపిస్తుంది. నూనెలు, మసాలా దినుసులు, ఇతర ఆహారాల వల్ల డబ్బాలు ఇలా అవుతాయి.
జిగట డబ్బాలను మురికిగా కనిపించేలా చేయడమే కాకుండా.. వాటిపై బ్యాక్టీరియా, ధూళి పేరుకుపోయేలా కూడా చేస్తుంది. వీటిని శుభ్రం చేయాలంటే చాలా కష్టం. అందుకే చాలా మంది కొన్ని రోజుల తర్వాత ఈ జబ్బాలు పనికి రావని డస్ట్ బిన్ లో వేసేస్తుంటారు. కానీ మీరు గనుక కొన్ని చిట్కాలను ఫాలో అయితే మాత్రం ప్లాస్టిక్ డబ్బాలు తలతల మెరిసిపోతాయి. ఇందుకోసం కొన్ని సింపుల్ పద్దతులను ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
వంట నూనె
ఈ చిట్కా మీకు కొంచెం వింతగా అనిపించొచ్చు. కానీ వంట నూనెతో కూడా మీరు ప్లాస్టిక్ డబ్బాలను క్లీన్ చేయొచ్చు. ఇందుకోసం మీరు జిగట కంటైనర్లపై కొద్దిగా వంటనూనెను అప్లై చేయండి. దీనిని ఒక గుడ్డ లేదా స్పాంజ్ తో రుద్దండి. ఆ తర్వాత డిష్ సబ్బు, గోరువెచ్చని నీటితో క్లీన్ చేసి ఆరబెట్టేస్తే సరి.
రైస్ వాటర్
రైస్ వాటర్ తో కూడా చాలా ఈజీగా మీరు జిగట కంటైనర్లను క్లీన్ చేయొచ్చు. ఇందుకోసం మీరు బియ్యాన్ని నీటిలో మరిగించి ఆ నీటిని చల్లారనివ్వండి. ఆ తర్వాత ఈ నీళ్లలో డబ్బాలను కాసేపు నానబెట్టి చేయండి. వీటిని శుభ్రమైన నీళ్లతో కడిగి ఆరబెట్టండి.
టూత్ పేస్ట్
టూత్ పేస్ట్ తో పళ్లను తోమడమే కాదు కిచెన్ బిన్లను శుభ్రం చేయడానికి కూడా దీన్ని ఉపయోగించొచ్చు. ఇందుకోసం జిగటగా ఉన్న ప్రాంతాల్లో కొద్దిగా టూత్ పేస్ట్ ను రాసి స్పాంజ్ లేదా బ్రష్ తో రుద్దండి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడిగి ఆరబెట్టండి.
డిష్ వాషింగ్ స్క్రబ్
ఈ చిట్కా చాలా ఈజీ. దీనితో మీరు చాలా ఫాస్ట్ గా కంటైనర్లను శుభ్రం చేయొచ్చు. దీని కోసం జిగట కంటైనర్లకు సబ్బును పెట్టండి. అలాగే బాగా రుద్దండి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడిగి ఆరబెట్టండి. అంతే..
నిమ్మకాయ, ఉప్పు
నిమ్మకాయ, ఉప్పుతో కూడా మీరు ఆయిలీగా ఉన్న డబ్బాలను నిమిషాల్లో శుభ్రం చేయొచ్చు. ఇందుకోసం అర నిమ్మకాయ రసంలో కొద్దిగా ఉప్పు వేసి కలపండి. తర్వాత ఈ మిశ్రమాన్ని డబ్బాలకు అప్లై చేసి స్క్రబ్బర్ తో రుద్దండి. తర్వాత డబ్బాలను శుభ్రమైన నీటితో కడిగి, ఆరబెట్టండి.
డిష్ సబ్బు, వేడి నీళ్లు
మీరు ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనుకుంటే గనుక వేడినీటిలో డిష్ సబ్బు మిక్స్ చేసి అందులో స్పాంజ్ ను ముంచండి. ఆ తర్వాత ఈ స్పాంజ్ తో డబ్బాలను బాగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత శుభ్రమైన నీటితో కడిగి ఆరబెట్టేస్తే సరి.