ఈ కింది ఫుడ్స్ ని కనుక మీ డైట్ లో భాగం చేసుకుంటే.. మహిళలు.. పీరియడ్ పెయిన్ ని సులభంగా బయటపడొచ్చు. మరి , ఆ ఫుడ్స్ ఏంటో ఓసారి చూద్దాం..
మహిళకు పీరియడ్స్ ప్రతినెలా వస్తూ ఉంటాయి. ప్రతి నెలా వచ్చేవి అయినా.. మహిళలను చాలా ఇబ్బంది పెడతాయి. ఆ సమయంలో విపరీతమైన నొప్పి ఉంటుంది. చాలా మంది ఆ నొప్పిని భరించలేక ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. కానీ.. అవి మనకు ఎలాంటి హాని చేయవు అని చెప్పలేం. అందుకే.. తొందరగా ట్యాబ్లెట్స్ వేసుకోలేం. అలా అని.. నొప్పి భరించాల్సిందేనా అంటే.. అవసరం లేదు. ఈ కింది ఫుడ్స్ ని కనుక మీ డైట్ లో భాగం చేసుకుంటే.. మహిళలు.. పీరియడ్ పెయిన్ ని సులభంగా బయటపడొచ్చు. మరి , ఆ ఫుడ్స్ ఏంటో ఓసారి చూద్దాం..
1.అరటి పండ్లు...
అరటి పండ్లను చాలా తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే.. పీరియడ్స్ సమయంలో నొప్పి నుంచి రిలీఫ్ ఇవ్వడంలో చాలా కీలకంగా పని చేస్తుంది. ఎందుకంటే అరటి పండ్లలో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి.. కడుపు ఉబ్బరాన్ని తగ్గించడంలో.. నీటిని నిలుపుకోవడంలో సహాయపడుతుంది. అరటి పండ్లను క్రమం తప్పకుండా తినడం వల్ల పీరియడ్స్ లో చాలా ఉపశమనంగా ఉంటుంది. రోజంతా ఎనర్జిటిక్ గా కూడా ఉంచుతుంది.
2.శొంటి..
శొంటి చాలా మందికి తెలిసే ఉంటుంది. చూడటానికి మనకు అల్లం లాగే కనపడుతుంది. కానీ.. ఎండిపోయినట్లుగా ఉంటుంది. దీనిలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రాపర్టీలు చాలా ఉంటాయి. ఇవి జీర్ణ క్రియను మెరుగుపరుస్తాయి. పీరియడ్స్ సమయంలో నొప్పిని ఈజీగా తగ్గిస్తుంది.
3.ఆకుకూరలు..
ఆకుకూరలు.. పీరియడ్స్ సమయంలో కచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే.. ఆకు పచ్చని ఆకుకూరల్లో ఐరన్, మెగ్నీషియం చాలా పుష్కలంగా ఉంటాయి. పీరియడ్ నొప్పి, తిమ్మరిని తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాదు.. పీరియడ్స్ లో అధిక రక్తస్రావం జరిగినా.. ఐరన్ లాస్ ని తగ్గించేస్తాయి. సలాడ్ రూపంలోనూ ఆకుకూరలు తీసుకోవచ్చు.
4.గ్రెయిన్స్..
హోల్ గ్రెయిన్స్ వోట్స్, క్వినోవా , బ్రౌన్ రైస్ వంటి ధాన్యాలలో అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది. బి విటమిన్లు , మెగ్నీషియంతో నిండి ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, కండరాల ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి, తద్వారా తిమ్మిరి నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. ఈ తృణధాన్యాలు కొన్నిసార్లు ఋతుస్రావంతో పాటు వచ్చే మలబద్ధకాన్ని కూడా నివారిస్తాయి.
5.పైనాపిల్..
పీరియడ్ సమయంలో.. పైనాపిల్ తింటే.. ఈజీగా ఆ నొప్పి నుంచి బయటపడొచ్చు. వీటిలో యాంటీ ఇన్ఫమేటరీ లక్షణాలతో కూడిన ఎంజైమ్, ఇది పీరియడ్స్ పెయిన్ ని సులభంగా తగ్గిస్తుంది.
6.డార్క్ చాక్లెట్..
ఈ పీరియడ్ సమయంలో.. డార్క్ చాక్లెట్ తినడం వల్ల కూడా పీరియడ్ పెయిన్ ని తగ్గించుకోవచ్చు. అయితే.. మరీ ఎక్కువగా కాకుండా.. మితంగా తినడం మంచిది.
7.వాటర్..
పీరియడ్ సమయంలో మహిళలు..కచ్చితంగా మంచినీరు ఎక్కువగా తాగాలి. తమ బాడీని ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. నీరు ఎక్కువగా తాగడం వల్ల కూడా.. పీరియడ్ పెయిన్ ని తగ్గించుకోవచ్చు.