ఈ ఒక్క క్రీం రాస్తే మోకాళ్లు, మోచేతుల నలుపు మటుమాయం అవుతుంది

By Shivaleela Rajamoni  |  First Published Jul 14, 2024, 12:54 PM IST

శరీరమంతా ఒక రంగులో ఉండే.. మన మోకాళ్లు, మోచేతుల రంగు మాత్రం డార్క్ గా ఉంటుంది. ఇది ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే మీరు ఈ నలుపును పోగొట్టాలనుకుంటే ఒక క్రీం ను రాస్తే సరిపోతుంది. దీంతో మీ శరీరం మొత్తం ఒకే రంగులో కనిపిస్తుంది.


ఆడవాళ్లు అందంగా కనిపించే విషయంలో అస్సలు కాంప్రమైజ్ కారు. అందుకే ప్రతిరోజూ చర్మ సంరక్షణను పాటిస్తారు. అయినా కూడా మోచేతులు, మోకాళ్లు మాత్రం డార్క్ కలర్ లో కనిపిస్తాయి. వీటి రంగు మిగతా శరీర భాగాల కంటే భిన్నంగా కనిపిస్తుంది. టీ షర్టులు, షార్ట్స్ ధరించడం వల్ల కూడా ఇలా అవుతాయి. కానీ దీనివల్ల ఇబ్బందిగా ఉంటుంది. అయితే మీరు ఇంట్లో ఒక సింపుల్ క్రీం ను తయారుచేసి వాడితే మోకాళ్లు, మోచేతులు తిరిగి తెల్లగా మారుతాయి. 

మోకాళ్లు, మోచేతులు ఎందుకు నల్లగా ఉంటాయి? 

Latest Videos

undefined

మోచేతులు, మోకాలి భాగం  మన శరీరంలోని మిగిలిన భాగాల కంటే ముదురు రంగులో ఉంటాయి. ఇది అందరికీ తెలిసింది. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. చనిపోయిన చర్మ కణాలు, సూర్యరశ్మి ప్రభావం, హార్మోన్లు, చర్మ సమస్యలు వంటి కొన్ని కారణాల వల్ల ఇలా మోచేతులు, మోకాళ్లు ముదురు రంగులో ఉంటాయి. 

ఈ ముదురు రంగును ఎలా పోగొట్టాలి? 

మోకాళ్లు, మోచేతుల ముదురు రంగును తొలగించడానికి మీరు మాయిశ్చరైజర్ ను, సన్ స్క్రీన్ ను ఉపయోగించొచ్చు. అలాగే తడి గుడ్డతో కూడా శుభ్రం చేసుకోవచ్చు.

క్రీం ను ఎలా తయారుచేయాలి? 

మోకాళ్లు, మోచేతుల ముదురు రంగులను పూర్తిగా పోగొట్టడానికి మీరు కొబ్బరినూనె, వాల్ నట్ పొడిని తీసుకోండి. రెండింటినీ సమాన పరిమాణంలో అంటే ఒక టీ స్పూన్ చొప్పున తీసుకోండి. ఇది క్రీం ను తయారుచేయడానికి సరిపోతుంది. ఈ క్రీం ను తయారు చేయడానికి ఈ రెండు వస్తువులను కలపండి. ఇప్పుడు మోచేతులు, మోకాళ్లకు 3 నిమిషాల పాటు స్క్రబ్ చేయండి. 

రోజూ స్నానం చేసిన తర్వాత మోచేతులు, మోకాళ్లను శుభ్రం చేసుకుని కొబ్బరినూనె పెట్టుకోవాలి.  పడుకునే ముందు కూడా ఇలా చేయొచ్చు. కొబ్బరినూనె, వాల్ నట్ పౌడర్ ను ఉపయోగించడం వల్ల మోచేతులు, మోకాళ్ల టానింగ్ తగ్గుతుంది. అలాగే పొడిబారే సమస్య కూడా తగ్గిపోతుంది. మిగతా శరీర భాగాలతో పాటుగా మోచేతులు, మోకాళ్లను కూడా బాగా శుభ్రం చేసుకోవాలి. వీటితో పాటుగా కొబ్బరినూనె వాడకం కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

click me!