కూరలో నూనె తగ్గించాలంటే ఏం చేయాలి?

By Shivaleela RajamoniFirst Published Jul 10, 2024, 11:01 AM IST
Highlights

కూరలో నూనె ఎంత తక్కువగా వేద్దామన్నా.. ఎక్కువ అవుతూనే ఉంటుంది. ఇంకా ఏం చేయాలి? అని చాలా మంది ఆలోచిస్తుంటారు. కూరలో నూనె ఎక్కువగా వేసి వేసి సడెన్ గా తగ్గించడం అంటే చాలా కష్టం. కానీ నూనె ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే ఈజీగా కూరల్లో నూనెను తగ్గించడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

నూనెతో చేసిన వంటలకు వంక పెట్టడానికి ఏమీ ఉండదు. ఎందుకంటే  ఇవి అంత టేస్టీగా ఉంటాయి మరి. కానీ నూనె మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది బాడీ ఫ్యాట్ ను పెంచుతుంది. బరువు పెరగడంతో పాటుగా ఎన్నో వ్యాధుల బారిన మనల్ని పడేస్తుంది. అందుకే ప్రస్తుత కాలంలో చాలా మంది తక్కువ నూనె వేయడానికి ప్రయత్నిస్తున్నారు. నూనెను వీలైనంత తగ్గించి ఆరోగ్యం గురించి కేర్ తీసుకుంటున్నారు. కానీ వంటలో నూనె ఎక్కువగా వేయడం అలవాటు అయిన వారికి సడెన్ గా తగ్గించడం అంటే కష్టంగా మారుతుంది. తక్కువగా వేయాలి అనుకుంటూనే చాలదేమో అని ఎక్కువగా వేసేస్తుంటారు. ఇంకొంతమంది ఎక్కువగా వేసి తక్కువనే వేసాను అని అనుకుంటుంటారు. నిజానికి ఒక అలవాటును సడెన్ గా మానేయడం కష్టం. కానీ నూనెను మాత్రం ఎక్కవుగా తినకూడదు. దీనివల్ల లేనిపోని వ్యాధులు వస్తాయి. అందుకే వంటలో నూను తగ్గించడానికి ఎలాంటి చిట్కాలను ఫాలో కావాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

ఎక్కువ నూనె డేంజర్: వంటల్లో నూనెను ఎక్కువగా వాడే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ ఫుడ్ లో నూనెను ఎక్కువగా వాడకూడదు. నూనెను ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె  జబ్బులు,  స్ట్రోక్,డయాబెటీస్,  కొలెస్ట్రాల్, ఊబకాయంతో పాటుగా మరెన్నో రోగాలు వస్తాయి. 

Latest Videos

స్ప్రే బాటిల్: తెలియకుండానే నూనెను ఎక్కువగా పోస్తున్నాం అనుకుంటే మీరు నూనెకు స్ప్రే బాటిల్ ను ఉయోగించండి. దీని వల్ల మీరు ఎంత నూనె పోస్తున్నారో ఈజీగా తెలిసిపోతుంది. అలాగే దీనిని వాడటం వల్ల మీరు ఎక్కువ నూనెను వాడకుండా ఉంటారు. 

నాన్-స్టిక్ పాన్: నాన్ స్టిక్ పాన్ లు మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. వీటిలో వంటలు చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా అవుతాయి. అంతేకాదు వీటిని వాడటం వల్ల మీరు నూనెను కూడా చాలా వరకు తగ్గించొచ్చు. మీరు తక్కువ నూనెతో వంట చేయాలనుకుంటే మాత్రం నాన్ స్టిక్ పాన్ ను ఖచ్చితంగా ఉపయోగించండి. దీనిలో తక్కువ నూనెతో వంట చేయొచ్చు. 

ఆవిరి వంట:  నూనెలో వండడానికి బదులుగా.. మీరు ఎంచక్కా ఆవిరితో కూడా కూరగాయలను ఉడికించి తినొచ్చు.నిజానికి నూనెలో వేపిన కూరగాయల కంటే ఆవిరితో ఉడికించిన కూరగాయలే మనకు ఎక్కువ పోషకాలను అందిస్తాయి. దీనివల్ల మీరు ఒక్క చుక్క నూనెను కూడా వాడాల్సిన అవసరం రాదు.

ఎయిర్ ఫ్రై: చాలా మంది నూనెలో డీప్ ఫ్రై చేసిన ఆహారాలను ఇష్టంగా తింటుంటారు. నిజానికి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. కానీ నూనెలో డీప్ ఫ్రై చేసిన ఆహారాలు ఆరోగ్యానికి అంత మంచివి కావు. అందుకే మీరు నూనె వాడకాన్ని తగ్గించాలనుకుంటే ఎయిర్ ఫ్రై లేదా ఓవెన్ ను ఉపయోగించండి. దీనికి నూనె పెద్దగా అవసరపడదు. 

తక్కువ ఉల్లిపాయలు:  ఉల్లిపాయలు వేయించడానికి నూనె ఎక్కువగా అవసరమవుతుంది. అందుకే మీరు కూరలో నూనెను తగ్గించాలనుకుంటే ఉల్లిపాయలను తక్కువగా వేయండి. ఉల్లిపాయలను తగ్గిస్తే మీరు నూనెను చాలా వరకు తగ్గించొచ్చు. 

టిష్యూ పేపర్ : మీరు వండిన ఆహారంలో నూనె ఎక్కువగా ఉన్నట్టైతే టిష్యూ పేపర్ ను ఉపయోగించండి. పకోడీలు, బజ్జీల్లో నూనె ఎక్కువగా ఉండే.. వీటిని టిష్యూ పేపర్ పై ఉంచండి. టిష్యూ నూనెను పీల్చుకుంటుంది. 
 

click me!