కొంతమంది బుగ్గలు మరీ బక్కగా, పీక్కపోయి ఉంటే .. మరికొంతమంది బుగ్గలు మరీ బొద్దుగా, లావుగా ఉంటాయ. లావుగా ఉంటే ముఖం మరీ బొద్దుగా కనిపించి అందం తగ్గుతుంది. మరి ఈ బొద్దు బుగ్గల్ని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
బరువు ఎక్కువగా ఉన్నా, బరువు తక్కువగా ఉన్నా.. కొంతమంది బుగ్గలు మరీ లావుగా ఉంటాయి. బుగ్గలపై కొవ్వు పేరుకుపోవడమే ఇందుకు కారణం. చాలా మందికి డబుల్ చిన్ ఉంటుంది. దీనివల్ల ముఖ అందం తగ్గుతుంది. మరి బుగ్గలను తగ్గించుకోవాలనుకునేవారు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
కార్బోహైడ్రేట్
undefined
కార్బోహైడ్రేట్ ఆహారాలను ఎక్కువగా తింటే శరీరంలో కొలెస్ట్రాల్ బాగా పెరుగుతుంది. పాల ఉత్పత్తులు, బియ్యం, బంగాళాదుంపలు, స్వీట్లు వంటి కొన్ని ఆహారాల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి తింటే మీ బుగ్గలు మరింత పెరుగుతాయి. అందుకే బుగ్గలు తగ్గాలంటే మాత్రం మీరు వీటిని తినకండి.
చూయింగ్ గమ్
చూయింగ్ గమ్ మన ఆరోగ్యానికి కూడా కొంత మేలు చేస్తుంది. దీన్ని ఉపయోగించి మీరు బొద్దుగా ఉండే బుగ్గలను తగ్గించుకోవచ్చు. ఇందుకోసం మీరు ప్రతిరోజూ ఒక గంట పాటు చూయింగ్ గమ్ ను నమలండి. ఇలా చేయడం వల్ల బుగ్గల్లోని కొవ్వు కరిగిపోతుంది.
ఆల్కహాల్
ఆల్కహాల్ ఆరోగ్యానికే కాదు శరీరానికి కూడా మంచిది కాదు. దీన్ని ఎక్కువగా తాగితే చెంపల్లో కొవ్వు విపరీతంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మీ బుగ్గలు సన్నగా కావాలంటే మాత్రం మీరు ఆల్కహాల్ ను తాగడం మానేయాలి.
నిద్ర
నిద్రకూడా మీరు బరువు పెరగడానికి, బుగ్గలు పెరగడానికి దారితీస్తుంది. కంటినిండా నిద్ర లేకపోవడం వల్ల ఒత్తిడి హార్మోన్లు పెరుగుతాయి. ఫలితంగా గడ్డంతో సహా శరీరమంతటా కొవ్వు బాగా పేరుకుపోతుంది. మీరు బరువు తగ్గాలన్నా, బుగ్గలు సన్నబడాలన్నా బాగా నిద్రపోవాలి.
చేపల భంగిమ
ఫిష్ పొజీషన్ అనేది ఒక రకమైన ముఖ యోగా. దీనిలో మీ బుగ్గలను చేప నోటిలా లోపలికి లాగండి. ఇలా ప్రతిరోజూ 5 నిమిషాల పాటు చేస్తే బుగ్గల్లోని అదనపు కొవ్వు కరిగిపోతుంది. బుగ్గలు సన్నగా, అందంగా మారుతాయి.
సోడియం
సోడియం ఎక్కువగా ఉండే ఆహారాలు శరీరంలో అదనపు నీటిని కలిగిస్తాయి. దీనివల్ల ముఖంపై కొవ్వు పెరుగుతుంది. ఇలా కాకూడదంటే మీరు సోడియం ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం మానుకోవాలి.