పీరియడ్స్ లో కడుపు నొప్పి, తిమ్మిరి వంటి సమస్యలు రాకూడదంటే ఇలా చేయండి..

By Mahesh RajamoniFirst Published Mar 19, 2023, 11:09 AM IST
Highlights

ఎండాకాలంలో పీరియడ్స్ సమయంలో మరిన్ని పరిశుభ్రత చిట్కాలను పాటించాలి. ఇవే వారి పీరియడ్స్ సమస్యల నుంచి కాస్త ఉపశమనం కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. 
 

రుతుస్రావం అనేది స్త్రీ శరీరంలో అత్యంత ముఖ్యమైన. కానీ పీరియడ్స్ సమయంలో విపరీతమైన కడుపు నొప్పి, మూడ్ స్వింగ్స్, తిమ్మిరి, వాంతులు, వికారం, తలనొప్పి వంటి ఎన్నో సమస్యలు వస్తుంటాయి. ఇవి అందరి మహిళలకు వస్తాయన్న గ్యారంటీ లేదు. పీరియడ్స్ ఒక్కొక్కరినీ ఒక్కోలా ప్రభావితం చేస్తాయి. అయితే మంచి పరిశుభ్రత పాటిస్తే.. మహిళలు శుభ్రంగా ఉండటమే కాకుండా పీరియడ్స్ నొప్పి కూడా నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే పీరియడ్స్ సమయంలో పరిశుభ్రతను పాటించాలి. 

పీరియడ్స్ సజావుగా సాగడానికి కొన్ని చిట్కాలు మీకోసం.. 

పీరియడ్స్ సమయంలో కాటన్ శానిటరీ న్యాప్కిన్స్ లేదా టాంపోన్లను వాడటం మంచిది. ఎందుకంటే అవి చర్మంపై సున్నితంగా ఉంటాయి. వీటి వాడకం వల్ల చికాకు లేదా దద్దుర్లు అసలే రావు. బట్టలపై మరకలు పడకుండా ఉండటానికి ఒకేసారి రెండు శానిటరీ ప్యాడ్లను కూడా ఉపయోగిస్తుంటారు. బ్లీడింగ్ ఎక్కువయ్యే మొదటి రెండు మూడు రోజులు ఇలా రెండు రెండు శానీటరీ ప్యాడ్లను ఉపయోగిస్తుంటారు చాలా మంది. దీనివల్ల బట్టలపై మరకలు పడవేమో కానీ.. ఎన్నో సమస్యలైతే వస్తాయి. ఎందుకంటే యోని ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. అందుకే  ఒకేసారి ఒక ప్యాడ్ ను మాత్రమే ఉపయోగించండి.

ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో ఆ ప్రాంతాన్ని గోరువెచ్చని నీటితో కడగాలి. ప్రతి నాలుగు గంటల తర్వాత మీ టాంపోన్లు లేదా ప్యాడ్లను ఖచ్చితంగా మార్చాలి. ప్రయాణం చేయాల్సి వస్తే ఎక్స్ ట్రా ప్యాడ్ లేదా టాంపోన్ ను తీసుకెళ్లండి. 

శ్వాసించే, సౌకర్యవంతమైన కాటన్ లో దుస్తులనే ధరించండి. ఇవి మీరు అనారోగ్యానికి గురికాకుండా కాపాడుతాయి. మీ జననేంద్రియ ప్రాంతంలో లేదా చుట్టుపక్కల దద్దుర్లు అయితే లైట్ తీసుకోకండి. దద్దుర్లు ఇతర సమస్యలు రాకూడదంటే వదులుగా ఉండే కాటన్ దుస్తులనే వేసుకోండి. 

పీరియడ్స్ సమయంలో మీరు తగినంత నీటిని తాగాలి. అప్పుడే మీ శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. పీరియడ్స్ సమయంలో మీకు కడుపు ఉబ్బినట్టైతే నీటిని పుష్కలంగా తాగండి. నీరు ఈ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది ఉబ్బరం తగ్గించడానికి సహాయపడుతుంది.

బహిష్టు సమయంలో శారీరక శ్రమ చాలా ముఖ్యం. పీరియడ్స్ సమయంలో హెవీ వర్కౌట్స్ కాకుండా వాకింగ్ లేదా యోగా లేదా సున్నితమైన వ్యాయామం చేయండి. నొప్పి ఇతర సమస్యల నుంచి మీ శరీరం ఉపశమనం పొందుతుంది. 

పీరియడ్స్ సమయంలో రోజుకు కనీసం రెండుసార్లైనా స్నానం చేయండి . అలాగే మీ జననేంద్రియ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచండి. టాయిలెట్ కు వెళ్లినా లేదా ప్యాడ్ ను మార్చిన తర్వాత మీ చేతులను సబ్బుతో నీట్ గా కడగండి. పనికిరాని రసాయనాలు కలిగిన వస్తువులను యోనిని శుభ్రం చేయడానికి వాడకండి. అలాగే జననేంద్రియాల దగ్గరున్న జుట్టును పూర్తిగా ఆరబెట్టండి.

గుర్తుంచుకోండి ఎప్పుడూ కూడా ముందు నుంచి వెనుకకు కడగాలి. వెనుక నుంచి ముందుకి తుడుచుకుంటే యోనిని ప్రమాదంలో పడుతుంది. దీనివల్ల సూక్ష్మక్రిములు యోనిలోకి ప్రవేశిస్తాయి. ఇది ఈస్ట్,మూత్ర మార్గము ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. 

click me!