అమ్మో.. కల్కీ బ్యూటీ దీపికా పదుకొనే చీర ఇంత కాస్ట్లీనా? ధర తెలిస్తే షాకే..!

By Shivaleela Rajamoni  |  First Published Jul 10, 2024, 2:58 PM IST

సెలబ్రిటీలు ఏం చేసినా వార్తే. ఇక వీళ్ల ముచ్చట్లు వితిన్ సెకండ్స్ లో సోషల్ మీడియాలో పిచ్చ పిచ్చగా వైరల్ అవుతుంటాయి. ఇలాంటి ఓ విషయమే సోషలో మీడియాలో తెగ తిరిగేస్తోంది. అది కూడా కల్కీ బ్యూటీకి సంబంధించిన విషయం. అదే దీపికా పదుకొనే చీర గురించి. చీర గురించా? అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే?


ప్రస్తుతం దీపికా పదుకొనే గర్భవతి అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయినా ఈ బ్యూటీ కల్కి 2898 ప్రమోషన్లలో కూడా యాక్టీవ్ గా పాల్గొన్నది. అలాగే గర్భిణీ స్త్రీలు చేయాల్సిన యోగాసనాల గురించి కూడా అవగాహన కల్పించడానికి యోగా చేస్తున్న ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. కానీ ఇది సాహసమనే చెప్పాలి. ఏదేమైనా సెలబ్రిటీలే కొత్తగా చేస్తూ వార్తల్లో నిలవడం చాలా కామన్. ఇక అసలు విషయానికొస్తే.. దీపికా కట్టిన చీర సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.అంతలా దీపికా కట్టిన చీర స్పెషలేంటీ? అన్న డౌంట్ రావొచ్చు. పదండి దాని గురించి ఓ లుక్కేద్దాం.. 

దీపికా పదుకొనే రీసెంట్ గా తన ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇక ఈ ఫోటోల్లో దీపికా లుక్ అదరహో అనిపించింది. ఈ ఫోటోలో దీపికా అందమైన పర్పుల్ కలర్ చీరలో కనిపించింది. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల సంగీత్ పార్టీకి దీపికా ఇలా రెడీ అయ్యింది. ఇక ఈ చీరలో బేబి బంప్ దిగిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అంతలా వైరల్ కావడానికి ఈ బ్యూటీ కట్టుకున్న చీరే కారణం. అవును ఈ చీర ధర తెలిస్తే సామాన్యుల గుండెలు దడేల్ మంటాయి. 

Latest Videos

అవును దీపిక పదుకొనే కట్టుకున్న ఈ చీర ధరతో సామాన్యుడి ఎన్నో అవసరాలు తీరుతాయి. అందులోనూ ఈ చీర తయారు కావడానికి ఏకంగా 3,400 గంటలు పట్టింది తెలుసా? అంతేకాక ఈ త్రీ పీస్ సెట్ ధర తెలిస్తే నోట్లో నుంచి ఒక్క మాట కూడా రాదు. ఇంత ధర పెట్టి కొన్న చీరలను వీళ్లు ఒక్కసారికి మించి మళ్లీ కట్టనే కట్టరు. అసలు ఈ చీర స్పెషలేంటో తెలుసా? 

దీపికా పదుకొణె కట్టుకున్న అందమైన పర్పుల్ కలర్ చీరను ఆర్గాంజా, జెన్నీ సిల్క్ తో తయారు చేసారు. చేతితో ఎంబ్రాయిడరీ చేసిన.. ఈ చీరను తయారుచేయడానికి 3,400 గంటల టైం పట్టిందట. ఈ చీరలో ముత్యాలు, జరీ, తీగల డిజైన్స్ ఉన్నాయి. ఇవే చీరను అందంగా మార్చేశాయి. ఇకపోతే ఈ చీరలో దీపికా పదుకొనే డీప్ నెక్ లైన్, హాఫ్ లెంగ్త్ స్లీవ్స్, క్రాప్డ్ హెమ్ తో సరిపోయే అందమైన బ్లౌజ్ ను వేసుకుంది. ముత్యాలతో తయారుచేసిన చోకర్ నెక్లెస్ తో అందంగా కనిపించింది.  దీపికా ధరించిన ఈ 'హుకుమ్ కీ రాణీ చీర సెట్' ధర ఏకంగా లక్షా 92 వేలు అంట. దీనిలో చీర ధర రూ.1,39,500 కాగా, బ్లౌజ్ ధర రూ.46,500. అండర్ స్కర్ట్ (పెటికోట్) ధర 7,500.

ఇకపోతే దీపికా, రణ్వీర్ సింగ్ ఆరేండ్లకు పైగా డేటింగ్ చేసి.. 2018లో పెళ్లి పీఠలెక్కారు. పెళ్లైన ఆరేండ్ల తర్వాత ఈ ఏడాది సెప్టెంబర్ లో ఈ జంట తొలి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. తన ప్రెగ్నెన్సీ, బేబీ బంప్ గురించి ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ ఈ నటి తన ప్రెగ్నెన్సీని అస్వాధిస్తోంది. 
 

click me!