షాంపూలో ఈ మూడింటిని కలిపి వాడితే మీ జుట్టు ఎంత పొడుగ్గా పెరుగుతుందో తెలుసా?

By Shivaleela Rajamoni  |  First Published Jul 10, 2024, 12:37 PM IST

జుట్టు పెరగడానికి నూనెలను మార్చడమే కాకుండా.. నెల నెలకు షాంపూలను కూడా మార్చేవారు ఉన్నారు. మీ జుట్టు పెరగాలంటే షాంపూను మార్చడం కాదు.. షాంపూలో కొన్ని పదార్థాలను కలిపి వాడండి. 
 


జుట్టు పొడుగ్గా, ఒత్తుగా ఉండాలన్న కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇందుకోసం అమ్మాయిలు రకరకాల నూనెలు, షాంపూలను తరచుగా మారుస్తూనే ఉంటారు. దీనివల్ల పెరగడం లేదని మరొకదాన్ని ట్రై చేస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల మీ జుట్టు దెబ్బతినే ప్రమాదం ఉంది. మీ జుట్టు పెరగడానికి మీరు పోషకాలున్న ఆహారం తినండి. అలాగే మీరు ఉపయోగించే షాంపూలో మూడు పదార్థాలను కలిపి వాడినా జుట్టు బాగా పెరుగుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

షాంపూకు చేర్చాల్సిన పదార్థాలు:   మీరు రోజూ వాడే షాంపూలో 2 టేబుల్ స్పూన్ల కాఫీ పౌడర్ ను, 1 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ ను,  2 టేబుల్ స్పూన్ల తేనె ను వేసి బాగా కలపండి. అరకప్పు షాంపూలో ఈ మూడు పదార్థాలను వేసి బాగా కలిపి అవసరమైనంత జుట్టుకు అప్లై చేసి వాష్ చేస్తే సరిపోతుంది. 

Latest Videos

ఎన్నిసార్లు వాడాలి: వీటిలో జుట్టు బాగా పెరుగుతుందని ఎవరైనా చెప్తే చాలు.. అమ్మాయిలు వీటిని సమయం, సందర్భం లేకుండా వాడేస్తూనే ఉంటారు. కానీ ఇష్టాను సారంగా వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి. అందుకే మీరు దీన్ని వారానికి రెండుసార్లు మాత్రమే ఉపయోగించండి. దీనివల్ల మీ జుట్టు బలంగా పెరుగుతుంది. 

కాఫీ పొడి ప్రయోజనాలు: కాఫీ పొడి మన శరీరానికే కాదు మన జుట్టుకు కూడా మంచి ప్రయోజనరంగా ఉంటుంది. కాఫీలో ఉండే కెఫిన్ మన జుట్టును పొడుగ్గా పెంచడానికి, జుట్టు రాలకుండా చేయడానికి బాగా సహాయపడుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

దాల్చినచెక్క ప్రయోజనాలు:  మసాలా దినుసుల్లో ఒక్కటైన దాల్చిన చెక్కలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. అందుకే దీన్నిఫుడ్ లో కాకుండా.. చర్మానికి, జుట్టుకు కూడా ఉపయోగిస్తారు. దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. ఇవి సహజ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. అలాగే జుట్టు బాగా పెరిగేందుకు సహాయపడతాయి. 

తేనె ప్రయోజనాలు:  తేనెను మనం ఎన్నో విధాలుగా ఉపయోగించుకోవచ్చు. దీనిని ఆరోగ్యానికే కాకుండా అందానికి కూడా ఉపయోగించొచ్చు. అంతేకాదు దీనిని మనం జుట్టుకు కూడా వాడొచ్చు. మీకు తెలుసా? తేనె నేచురల్ హెయిర్ కండీషనర్ గా కూడా పనిచేస్తుంది. అలాగే ఇది జుట్టును తేమగా, మృదువుగా ఉంచడానికి బాగా సహాయపడుతుంది.

click me!