చిత్రలిపి - 2020: మన సాంస్కృతిక రాయబారికి వందనం...అభివందనం

By Siva KodatiFirst Published Jan 14, 2020, 1:42 PM IST
Highlights

పురుషుడు బయట, స్త్రీ ఇంట అలవర్చుకున్న జీవనశైలి క్రమంగా దెబ్బతింటున్నది. వృత్తులు దెబ్బతిన్నాక మగవాడు యంత్రభూతం కోరలు తోమే బానిస కావడం ఎరిగినదే. స్త్రీకి గృహం మీదనే కాదు, మొత్తం కుటుంభం మీద పట్టు వీగిపోయింది. 

'ఆధునికత అన్నది కుందేటి కొమ్ము' అంటారు ప్రసిద్ద జానపద కళాకారులు శ్రీ కాపు రాజయ్య. ఆ మేరకు మన ఆధునికత అన్నది వట్టిదే. అది ఒక అభాస.

 

 

 

ఇప్పుడు మనం అభివృద్ధి పథంలో అలవర్చుకున్నవని భావిస్తున్నవేవీ నిజం కాదు, తాత్కాలిక బ్రమలే అన్నది రోజు రోజుకూ అవగతం అవుతూనే ఉన్నది.

 

 

 

ఆర్థిక స్వాతత్రం పేరిట మహిళలు సాధిస్తున్నవేవీ ఆమెకు సుఖశాంతులను ఇవ్వకపోగా అనవసరమైన ఒత్తిడికి గురిచేస్తూనే ఉన్నవి. ఇంటా భయటా రెండు విధాలా ఆమె నిత్యం ఎదురీదే పరిస్థితే ఉన్నది.

 

 

 

పురుషుడు బయట, స్త్రీ ఇంట అలవర్చుకున్న జీవనశైలి క్రమంగా దెబ్బతింటున్నది. వృత్తులు దెబ్బతిన్నాక మగవాడు యంత్రభూతం కోరలు తోమే బానిస కావడం ఎరిగినదే. స్త్రీకి గృహం మీదనే కాదు, మొత్తం కుటుంభం మీద పట్టు వీగిపోయింది. మానవ సంభంధాలు పెరుకే. ఇప్పుడు ఇద్దరూ బానిసకొక బానిస మాదిరి పరాయీకరణకు గురైన వారే. అధినికత పేరిట జానపదం,వారి ప్రకృతి ద్వంసం అయింది.

 

 

 

ఇప్పుడు పండుగలే గొప్ప సాధనాలు. వెనుతిరిగి చూసుకునే సిసలైన అంతరంగాలు. నిజమైన లోగిళ్ళు. సంసృతే మనల్ని కాపాడే కాలిబాట. తెలంగాణా రాష్ట్రాన్ని తెచ్చింది కూడా ఆటా పాటా అన్నది గుర్తు తెచ్చుకోవాలె.

 

 

 

చిత్రమేమిటంటే, పండుగలు వచ్చినప్పుడు మనుషులు పువ్వుల్లాగా వికసించడం చూస్తున్నదే. ముఖ్యంగా బతుకమ్మ, బోనాలు, సంక్రాంతి - ఉగాది ఈ పండుగలలో మనుషుల ప్రకృతి ఎంత రమణీయంగా వ్యక్తం అవుతున్నదీ అంటే ఇంకా పిట్ట ఎగిరిపోలేదనే అర్థం. అందుకే ఆ జీవకళ.

 

 

విశేషం ఏమిటంటే, ముఖ్యంగా పురుషుడితో పోలిస్తే, మహిళలే ఇంకా తమ ఆత్మకు కోల్పోలేదు. అందుకే వారే నిజమైన రాయబారులు, సంస్కృతికి, సంప్రదాయాలకు, ప్రకృతితో మమేకమయ్యే జీవితానికి వారే సిసలైన వారధులు.

 

మహిళలే చిత్రకళాది దేవతకు సహజ సౌందర్య శోభిత ఆభరణాలు అంటారు రావి ప్రేమలత గారు. అది నిస్సందేహంగా నిజం.

ఇంటిముందు వాకిలినే గ్యాలరీ చేసుకుని, అనునిత్యం నిన్న వేసిన ముగ్గును నేడు మలిపేసి సరికొత్తగా జీవితాన్ని శోభితం చేసే సిసలైన సృజన కారులు. నిండు జీవితం గడుపుతున్న ఆ మహిళామూర్తులకు మనసారా వందనాలు. వారి మునివేళ్ళ మీదుగా ఆవిష్కారం అయ్యే చిత్రలిపికి కృతజ్ఞాతాభివందనాలు.

 

చిత్ర నీరాజనాలు....

-కందుకూరి రమేష్ బాబు
పుప్పాలగూడ | తెలంగాణ

click me!