శీతాకాలంలో టమాటతో అందం మీ సొంతం..

By telugu team  |  First Published Jan 7, 2020, 2:53 PM IST

ఇక జిడ్డు చర్మ స్వభావం కలిగినవారు టమోటో జ్యూస్‌తో ముఖం మీద మసాజ్ చేయాలి. టమోటో జ్యూస్‌కు నిమ్మరసం మిక్స్ చేసి, ముఖానికి పట్టించాలి. అప్లై చేసిన తర్వాత ఓ ఇరవై నిముషాలు ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి.



టమాటాలు తినడం వల్ల కలిగే లాభాలు అందరికీ తెలిసే ఉంటాయి. అయితే... ఈ టమాటాలు కేవలం తినడానికి మాత్రమే కాదు... ముఖంపై అందం పెంచుకోవడానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. టమాటాలో  ఉండే లైకోపెన్.. యాంటీ ఎజినింగ్ గా పనిచేస్తుంది.

టమోటోలోని నేచురల్ ఆస్ట్రిజెంట్, చర్మ రంధ్రాలను శుభ్రం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. టమోటో జ్యూస్ కూడా చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇది మొటిమలను మరియు డార్క్ స్పాట్స్‌ను తగ్గిస్తుంది.

Latest Videos

టమోటో జ్యూస్‌కు కొద్దిగా నిమ్మరసం చేర్చి, అందులో కాటన్ బాల్స్ డిప్ చేసి ముఖం పైన అప్లై చేస్తే స్కిన్ మెరిసిపోతుంది.

ఇక జిడ్డు చర్మ స్వభావం కలిగినవారు టమోటో జ్యూస్‌తో ముఖం మీద మసాజ్ చేయాలి. టమోటో జ్యూస్‌కు నిమ్మరసం మిక్స్ చేసి, ముఖానికి పట్టించాలి. అప్లై చేసిన తర్వాత ఓ ఇరవై నిముషాలు ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి.

రెండు టమాటాలను గుజ్జుగా చేసి.. అందులో ఒక టేబుల్‌స్పూన్ నిమ్మరసం కలిపి మిక్స్ చేయాలి. దీన్ని ముఖానికి పట్టిస్తే.. చర్మానికి మృదుత్వం వస్తుంది...,  టమాటా గుజ్జులో పాలను కలిపి చూడండి.. ఆ ప్యాక్‌ని ముఖానికి రాసుకుంటే.. ముఖం కాంతివంతంగా మారుతుంది.
 
ఒక గిన్నెలో టమాటా రసం, మజ్జిగ కలపండి. ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లయ్ చేసిన తర్వాత చల్లని నీటితో కడిగిస్తే సరి.., టమాటా గుజ్జులో తేనె కలిపి ముఖానికి రాయండి. కాసేపయ్యాక కడుక్కుంటే మంచి ఫలితం దక్కుతుంది.

click me!