అండర్ ఆర్మ్స్ తెల్లగా మారాలంటే..

By ramya N  |  First Published Mar 1, 2019, 3:32 PM IST

చాలా మంది అమ్మాయిలను వేధించే సమస్యల్లో అండర్ ఆర్మ్స్ ఒకటి. శరీరమంతా ఒక రంగులో ఉంటే.. అండర్ ఆర్మ్స్ మాత్రం.. నల్లగా, మచ్చలు పడినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. 


చాలా మంది అమ్మాయిలను వేధించే సమస్యల్లో అండర్ ఆర్మ్స్ ఒకటి. శరీరమంతా ఒక రంగులో ఉంటే.. అండర్ ఆర్మ్స్ మాత్రం.. నల్లగా, మచ్చలు పడినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు స్లీవ్ లెస్ డ్రస్ లు వేసుకోవాలంటే  ఇబ్బందిగా ఉంటుంది. 

అలా అని మార్కెట్లో లభించే ఏదైనా అండర్ ఆర్మ్ వైట్ నర్ వాడదామంటే.. అవి అందరికీ పడకపోవచ్చు. అక్కడ నల్ల మచ్చలు తగ్గకపోగా.. దద్దుర్లు, దురదలాంటివి వచ్చే అవకాశం ఉంది. మరి దీనికి పరిష్కారమే లేదా అంటే.. ఇక ఇంటి చిట్కాతో ఈ ససమ్యను నివారించవచ్చు అంటున్నారు నిపుణులు.

Latest Videos

అండర్ ఆర్మ్స్ తెల్లగా మారడానికి తెల్లగా మారడానికి ఇంట్లోనే అండర్‌ ఆర్మ్‌ ప్యాక్‌ తయారు చేసుకుని వాడి చూడండి అంటున్నారు నిపుణులు.  బేకింగ్‌ సోడా, కొబ్బరినూనె సమపాళ్లలో కలుపుకొని, బాహుమూలాల్లో స్క్రబ్‌ చేయాలి. 10 నుంచి 15 నిమిషాల తర్వాత నీళ్లతో కడిగేయాలి. బేకింగ్‌ సోడా వల్ల ఆ ప్రదేశంలోని చర్మం ఎక్స్‌ఫోలియేట్‌ అవుతుంది. ఇలా క్రమం తప్పకుండా రెండు రోజులకొకసారి చేస్తే, బాహుమూలాలు మామూలు రంగులోకి మారుతాయి.

click me!