ముఖంపై ముడతలు పోవాలంటే..

By ramya NFirst Published Feb 14, 2019, 2:58 PM IST
Highlights

కొన్ని వంటింటి చిట్కాలు ఫాలో అయితే చాలు..  యవ్వనంగా మెరిసిపోతారు అని చెబుతున్నారు నిపుణులు. మరి అవేంటో మనమూ చూసేద్దామా...

వయసు పెరిగే కొద్దీ.. ముఖంపై ముడతలు రావడం సహజం. అయితే.. ఇప్పుడు తాజాగా మార్కెట్లోకి యాంటీ ఎజెనింగ్ పేరిట క్రీములు వచ్చేస్తున్నాయి. వాటి ఖరీదు కూడా భారీగా నే ఉంటుంది. అయితే.. ఇవేమీ లేకుండా సహజంగా కొన్ని వంటింటి చిట్కాలు ఫాలో అయితే చాలు.. చర్మం యవ్వనంగా మెరిసిపోతారు అని చెబుతున్నారు నిపుణులు. మరి అవేంటో మనమూ చూసేద్దామా...

ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొని.. ఆ తర్వాత ముఖానికి నాలుగు చుక్కల నిమ్మరం రాయాలి. అరగంటపాటు అలా వదిలేసి.. తర్వాత నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తరచూ ఇలా చేయడం వల్ల ఫలితం కనపడుతుంది.

ఆలివ్ ఆయిల్ ముఖానికి రాసుకొని మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల ముడతలు తగ్గి.. ముఖం కాంతివంతంగా మారుతుంది. అదేవిధంగా తరచూ క్యారెట్, బీట్ రూట్ జ్యూస్ లు తాగినా కూడా ఫలితం మెరుగ్గా ఉంటుందంటున్నారు నిపుణులు. ముడతలు పోవడమే కాదు.. యంగ్ గా కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

బాగా పండిన బొప్పాయి లేదా అరటి గుజ్జులను ముఖం, మెడ వంటి ప్రాంతాల్లో రాసి.. కొద్ది సేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మెరవడంతోపాటు.. ముడతలు కూడా తగ్గుముఖం పడతాయి.  

click me!