రోజుకు ఐదారు సార్లైనా ముఖం కడిగేవారు చాలా మందే ఉన్నారు. కానీ సబ్బుతో ముఖాన్ని ఎక్కువ సార్లు ముఖాన్ని కడగడం మంచిది కాదు. అయితే ఉప్పు కలిపిన నీళ్లతో ముఖాన్ని కడితే ఎన్నో లాభాలు కలుగుతాయంటున్నారు నిపుణులు. అవేంటంటే?
అమ్మాయిలు అందంగా కనిపించే విషయంలో అస్సలు కాంప్రమైజ్ కారు. ముఖ్యంగా ముఖాన్ని అందంగా ఉంచడానికి ఎన్నో చేస్తుంటారు. ఎప్పుడూ ముఖం అందంగా, ప్రకాశవంతమైన ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. ఇందుకోసం ముఖానికి వివిధ రకాల క్రీములు, బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడుతుంటారు. అయితే కొంతమంది మాత్రం కెమికల్స్ ఉంటాయని బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడకుండా ఉంటారు. నేచురల్ పద్దతిలో అందంగా కనిపించడానికి ప్రయత్నిస్తుంటారు. మీకు తెలుసా? ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో అందాన్ని కాపాడుకోవచ్చు.
ఇలాంటి పదార్ధాలలో ఉప్పు ఒకటి. అవును ఉప్పు కలిపిన నీళ్లతో ముఖాన్ని కడగడం వల్ల ఎన్నో ఎన్నెన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే ఈ రోజు ఉప్పు నీళ్లతో ముఖాన్ని కడగడం వల్ల ఎలాంటి లాభాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
undefined
మొటిమల నుంచి ఉపశమనం: ముఖంపై ఎప్పుడూ మొటిమలు ఏర్పడుతుంటే మీ ముఖాన్ని ఉప్పు నీటితో కడగడం అలవాటు చేసుకోండి. ఉప్పులోని సోడియం మొటిమలను తగ్గిస్తుంది. అలాగే మొటిమల మచ్చలు కూడా పోతాయి. ఇందుకోసం ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో చిటికెడు ఉప్పు వేసి బాగా కరిగించండి. ఈ నీళ్లతో ముఖాన్ని తరచుగా కడగండి. ఇలా వారం నుంచి 15 రోజుల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
జిడ్డును తొలగిస్తుంది.: మీ చర్మం ఆయిలీగా ఉన్నట్టైతే ఉప్పు నీరు మీకు బాగా సహాయపడుతుంది. ఉప్పు నీళ్లతో ముఖాన్ని కడగడం వల్ల ముఖానికి ఉన్న అదనపు నూనె పదార్థాలు తొలగిపోతాయి. జిడ్డు ముఖంలోని చిన్న రంధ్రాల ద్వారా చర్మంలోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల మొటిమలు ఏర్పడతాయి. కానీ ఉప్పు నీరు ఈ రంధ్రాలను మూసివేయడానికి సహాయపడుతుంది. ఇది మీ ముఖాన్ని అందంగా మార్చేస్తుంది.
మృతకణాలు, మచ్చలను తొలగింపు : ప్రతి ఒక్కరి ముఖంపై మృతకణాలు ఖచ్చితంగా ఉంటాయి. దీనివల్ల ముఖంపై మొటిమలు లేదా నల్ల మచ్చలు ఏర్పడతాయి. ఆ చర్మ కణాలు చనిపోవడం వల్ల ఆ ప్రదేశంలో కొత్త కణాలు పెరగవు, ఫలితంగా నల్లటి మచ్చ ఏర్పడుతాయి. అయితే మీరు క్రమం తప్పకుండా ఉప్పు నీటితో ముఖాన్ని కడుక్కుంటే ఈ మృతకణాలు మాయమవుతాయి.
ఉప్పు నీటితో ముఖం కడుక్కోవడం వల్ల కలిగే నష్టాలు
చర్మం పొడిబారొచ్చు: ఉప్పు నీళ్ల వల్ల ముఖంపై రంధ్రాలను మూసుకుపోయి ముఖాన్ని పొడిబారేలా చేస్తుంది. ఇలా చేయడం వల్ల చర్మం పొడిబారి నీరసంగా కనిపిస్తుంది. ఇప్పటికే మీకు పొడి చర్మం ఉంటే ఉప్పు నీటితో ముఖం కడుక్కుంటే మరింత పొడిబారుతుంది.
చర్మపు చికాకు, అలెర్జీలు: కొంతమందికి చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. ఇలాంటి వారు ఉప్పు నీళ్లతో ముఖం కడుక్కుంటే వారికి అలెర్జీలు లేదా చికాకు కలుగుతాయి. ఇది చర్మపు చికాకు లేదా అలెర్జీలను కలిగిస్తుంది.
చర్మం పాలిపోవచ్చు: మీరు రెగ్యులర్ గా ఉప్పు నీటితో ముఖాన్ని కడుక్కుంటే చర్మం ఉపరితలం పలుచగా మారుతుంది. దీనివల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే రాడికల్స్ ఉప్పు నీటితో దెబ్బతింటాయి. ఇది మీ చర్మాన్ని ఎర్రగా మారుస్తుంది.