శ్రీయా శరణ్ చెక్కు చెదరని అందం సీక్రెట్ ఇదే...!

Published : Mar 21, 2023, 02:43 PM IST
శ్రీయా శరణ్ చెక్కు చెదరని అందం సీక్రెట్ ఇదే...!

సారాంశం

శ్రీయా అందం ఇప్పటికీ వన్నె తగ్గలేదనే చెప్పాలి. మరి ఆమె బ్యూటీ సీక్రెట్ ఏంటో మనమూ తెలుసుకుందామా..


అందాల భామ శ్రీయ గురించి టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా శ్రీయ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తోంది. టాలీవుడ్ స్టార్స్ అందరి సరసన నటించి ఓ వెలుగు వెలిగిన నటి శ్రీయ అందంతో అభినయంతో మెప్పించింది. ఇప్పటికీ ఆమె నటిగా కొనసాగుతూనే ఉంది. హీరోయిన్లకు వయసు పెరిగే కొద్దీ ఆఫర్స్ తగ్గడం సహజం. శ్రీయ విషయంలో కూడా అదే జరిగింది. కానీ ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇటీవల ఆమెకు టాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయి. అప్పుడప్పుడూ మాత్రమే కనిపిస్తోంది. రీసెంట్ గా శ్రీయ గమనం చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రంలో శ్రీయ నటనకు ప్రశంసలు దక్కాయి. 

ఈ సంగతి పక్కన పెడితే... శ్రీయా అందం ఇప్పటికీ వన్నె తగ్గలేదనే చెప్పాలి. మరి ఆమె బ్యూటీ సీక్రెట్ ఏంటో మనమూ తెలుసుకుందామా..

శ్రీయా.. క్రమం తప్పకుండా రోస్ వాటర్ వాడుతూ ఉంటారట. తాను ఎక్కడికి వెళ్లినా ఒక బాటిల్ రోస్ వాటర్  తీసుకొని వెళతారట. ప్రతిరోజూ ఆమె ఎక్కడికి వెళ్లినా కూడా రోజ్ వాటర్ ని ఉపయోగిస్తూ ఉంటారు.

అంతేకాకుండా ఆమె సహజంగా తయారు చేసిన మాయిశ్చరైజర్ ని ఉపయోగిస్తూ ఉంటారట. దీనిని రోజ్ వాటర్, గ్లిజరిన్ తో కలిపి తయారు చేస్తారు. దీనినే ఆమె ఉపయోగిస్తూ ఉంటారట.

దీనితో పాటు... శ్రియా ఒక క్లెన్సర్ ని ఉపయోగిస్తూ ఉంటారట. శెనగపిండిలో పసుపు, పెరుగు వేసి బాగా కలిపి.. దానిని ఆమె తరచూ ఉపయోగిస్తూ ఉంటారట.

తన కళ్లు బ్రైట్ గా కనిపించేందుకు ఆమె సహజంగా తయారు చేసిన కాజల్ ని ఉపయోగిస్తూ ఉంటారట. తన  చర్మం సహజంగా మెరుస్తూ ఉండేందుకు ఆమె తరచుగా ఆరెంజ్ జ్యూస్ తాగుతూ ఉంటారట. ఆమె తరచూ చేపను తన ఆహారంలో భాగం చేసుకుంటూ ఉంటారట. దానిలో ఉండే కొలాజెన్,, విటమిన్ ఈ  ఆమె అందంగా కనిపించడానికి ఉపయోగపడుతుందట.

తన చర్మాన్ని హైడ్రెటెడ్ గా ఉంచుకునేందుకు ఆమె మంచినీరు ఎక్కువగా తాగుతూ ఉంటారట. దీని వల్ల తరచూ చర్మం తేమగా కనపడుతుంది.

PREV
click me!

Recommended Stories

10 గ్రాముల్లో అందమైన బంగారు నెక్లెస్.. లేటెస్ట్ డిజైన్స్ ఇవిగో!
పాదాల అందాన్ని రెట్టింపు చేసే మెట్టెలు