మిలియన్ డాలర్లతో కాళ్లకు ఇన్సూరెన్స్ చేయించిన బ్యూటీ క్వీన్..!

By telugu news teamFirst Published Jun 11, 2021, 12:47 PM IST
Highlights

మిస్ వరల్డ్ ఆస్ట్రేలియా సారా మార్ష్కే ప్రస్తుతం ఇలాంటి పనిచేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. తన కాళ్లకు ఆమె ఇన్సూరెన్స్ చేయించుకున్నారు.

భవిష్యత్తు గురించి ఆలోచించి ఇన్సూరెన్స్ చేయించుకోవడం  చాలా సహజం. విలువైన వస్తువులను పోయినా, లేదా ఏదైనా డ్యామేజ్ జరిగినా.. మనం నష్టపోకుండా ఉండేందుకు చాలా మంది ఇన్సూరెన్స్ లు చేయించుకుంటున్నారు. మనలాంటి వారైతే ఇంటికి, కారుకి చేయించుకుంటాం. అయితే.. శరరీంలోని అవయవాలకు కూడా ఇన్సూరెన్స్ చేయించుకుంటారనే విషయం మీకు తెలుసా..?

మిస్ వరల్డ్ ఆస్ట్రేలియా సారా మార్ష్కే ప్రస్తుతం ఇలాంటి పనిచేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. తన కాళ్లకు ఆమె ఇన్సూరెన్స్ చేయించుకున్నారు. దాదాపు 1 మిలియన్ డాలర్లకు ఆమె ఇన్సూరెన్స్ చేయించుకోవడం విశేషం.

తన శరీరంలో కాళ్లు చాలా పొడవుగా ఉంటాయని.. అవి చాలా అందంగా ఉంటాయని.. అందుకే వాటికి ఇన్సూరెన్స్ చేయించుకున్నట్లు ఈ 22ఏళ్ల బ్యూటీ చెప్పడం విశేషం.

కాగా.. సారా స్పోర్ట్స్ మోడల్ గా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. 2019లో ఆమె మిస్ వరల్డ్ ఆస్ట్రేలియా  టైటిల్  గెలుపొందారు. సారా మార్ష్కే బుండా బర్గ్ లో జన్మించింది.  సారా.. ఏఎఫ్ఎల్ వుమెన్స్ ఆస్ట్రేలియా నేషనల్ లో కనిపించనున్నారు. ఇది కేవలం మహిళల కోసం నిర్వహించే ఫుట్ బాల్ లీగ్ కావడం గమనార్హం. 

కాగా.. చిన్న తనంలో తాను ఎదుర్కొన్న సంఘటనలను కూడా ఆమె వివరించారు. టీనేజ్ లో ఉన్నప్పుడు అందరూ తనను టీజ్ చేసేవారని చెప్పింది. నువ్వు చాలా సన్నగా ఉన్నావ్.. నువ్వేంటీ ఇంత పొడుగున్నావ్, నీ కాళ్లేంటి ఎంత పొడుగు ఉన్నాయ్ అంటూ అందరూ తనని టీజ్ చేసేవారని గుర్తు  చేసుకుంది.

ఇప్పుడు తాను తన కాళ్లకు ఇన్సూరెన్స్ చేయించుకున్నాననే విషయం తెలిస్తే.. వాళ్లంతా  జలస్ ఫీలౌతారని ఆమె పేర్కొన్నారు. ఇప్పుడు అందరూ తన కాళ్లనే పొగుడ్తుంటారని ఆమె చెప్పడం విశేషం.

click me!