బెంగాల్ ఎన్నికలు: నందిగ్రామ్‌‌లో మమతా బెనర్జీపై దాడి, సీఎంకు గాయాలు

By Siva KodatiFirst Published Mar 10, 2021, 6:58 PM IST
Highlights

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ నందిగ్రామ్‌లో బుధవారం ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై కొందరు దాడికి పాల్పడ్డారు. 

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ నందిగ్రామ్‌లో బుధవారం ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై కొందరు దాడికి పాల్పడ్డారు.

ఈ ఘటనలో ముఖ్యమంత్రికి స్వల్ప గాయాలైనట్లుగా తెలుస్తోంది. తనపై నలుగురు వ్యక్తులు దాడి చేశారని మమత ఆరోపించారు. ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో నందిగ్రామ్ పర్యటను దీదీ రద్దు చేసుకున్నారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగిన మమతా బెనర్జీ ఇవాళ నామినేషన్ వేసేందుకు అక్కడికి వచ్చారు. నామినేషన్ పత్రాలు సమర్పించిన అనంతరం రియాపాడలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆమె తిరిగి వెళ్లేందుకు కారు దగ్గరకు చేరుకున్నారు.

ఈ సమయంలో నలుగురు వ్యక్తులు ఆమెను తోసివేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో దీదీ కాలికి గాయాలయ్యాయి. అయితే తన నందిగ్రామ్ పర్యటనలో భద్రతా లోపాలు వున్నాయని.. తనకు పోలీసులు సరైన భద్రత కల్పించలేదంటూ మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే బెంగాల్ డీజీపీని ఈసీ బదిలీ చేసిన తర్వాత మమతపై దాడి జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

click me!