నందిగ్రామ్‌ నుండి నామినేషన్ దాఖలు చేసిన మమత బెనర్జీ

By narsimha lodeFirst Published Mar 10, 2021, 3:58 PM IST
Highlights

నందిగ్రామ్ అసెంబ్లీ స్థానం నుండి పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ బుధవారంనాడు నామినేషన్ దాఖలు చేశారు.


కోల్‌కత్తా:నందిగ్రామ్ అసెంబ్లీ స్థానం నుండి పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ బుధవారంనాడు నామినేషన్ దాఖలు చేశారు.ఈ స్థానం నుండి సువేంద్ అధికారి సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్నారు. గత ఏడాది డిసెంబర్ వరకు సువేంధు అధికారి టీఎంసీలోనే ఉన్నారు. ఆయన టీఎంసీని వీడి బీజేపీలో చేరారు.

మమత బెనర్జీకి అత్యంత సన్నిహితంగా ఉన్న టీఎంసీ నేతల్లో సువేంధు అధికారి ఒకరు. నందిగ్రామ్ నుండి మమత బెనర్జీ పోటీ చేస్తే ఆమెను 50 వేల ఓట్లతో ఓడిస్తానని సువేంధు సవాల్ చేశారు.

ఈ సవాల్ ను స్వీకరించిన మమత బెనర్జీ నందిగ్రామ్ నుండి పోటీ చేస్తానని ప్రకటించారు. అంతేకాదు ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. నందిగ్రామ్ లోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.

బెంగాల్ లో లెఫ్ట్ ప్రంట్ ప్రభుత్వం కుప్పకూలి టీఎంసీ అధికారంలోకి రావడానికి నందిగ్రామ్ లో కార్ల ఫ్యాక్టరీ ఏర్పాటుకు భూసేకరణ ప్రధాన కారణమైంది.ఈ  భూసేకరణను నిరసిస్తూ టీఎంసీ  పోరాటం చేసింది. ఈ పోరాటంలో సువేంధు కీలక పాత్ర పోషించారు. 

రాష్ట్రంలోని సుమారు 40 అసెంబ్లీ స్థానాల్లో సువేంధు కుటుంబం ప్రభావం ఉంటుంది. మమత బెనర్జీ ఈ స్థానం నుండి పోటీ చేయడం ప్రాధాన్యత నెలకొంది. ఇదే స్థానం నుండి సువేంధు పోటీ చేయనున్నారు.

click me!