పవన్ కళ్యాణ్ కి పవర్ స్టార్ కాదు పిరికి స్టార్ అని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదని అమర్‌నాధ్ విమర్శించారు. రాజకీయపార్టీ నడపే ,ప్రజలకు కోసం మాట్లాడే నైతిక హక్కు పవన్ కళ్యాణ్ కోల్పోయారని ఆయన వ్యాఖ్యానించారు.
పవన్ కళ్యాణ్ కి పవర్ స్టార్ కాదు పిరికి స్టార్ అని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదని అమర్‌నాధ్ విమర్శించారు. రాజకీయపార్టీ నడపే ,ప్రజలకు కోసం మాట్లాడే నైతిక హక్కు పవన్ కళ్యాణ్ కోల్పోయారని ఆయన వ్యాఖ్యానించారు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ రెడ్డి. విశాఖలో భూకబ్జా జరిగిందంటూ కన్నా చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన ఎంత త్వరగా టీడీపీలోకి వెళ్లిపోవాలని చూస్తున్నారో అర్ధమవుతోందన్నారు. భూకబ్జా జరిగి ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలిగా అని అమర్‌నాథ్ ప్రశ్నించారు.
undefined
Also Read:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొత్తు వారితోనే...: ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ రెడ్డి
తాము పోలీసులను సంప్రదిస్తే ఎక్కడా ఆయన ఫిర్యాదు చేయలేదని తేలిందన్నారు. కన్నా లక్ష్మీ నారాయణ భూములు పై ఆరా తీస్తే రక్షణ గోడ కట్టి చక్కగా భద్రంగా ఉందని గుడివాడ స్పష్టం చేశారు. ప్రభుత్వంపై బురదచల్లాలనే ఆరోపణలు తప్ప మరోటికాదని, జగన్ సర్కార్ ప్రతిష్టను దెబ్బతీయాలనేదే వారి లక్ష్యమన్నారు.
ఎవరిచేతిలో భూమి ఉందో వారు ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదని, వారికి తాము అండగా ఉంటామని అమర్‌నాథ్ స్పష్టం చేశారు. విశాఖ రాజధానిగా ప్రకటించిన తరవాత టీడీపీ, జనసేన, ఇప్పుడు భాజపా పెద్దలు విమర్శలు, నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
టిడిపి అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ భూములు కబ్జా చేసేందుకు చేసిస ప్రయత్నాలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందని, ఈ ప్రాంత ప్రజల భూములను తాము కాపాడుతున్నామని గుడివాడ వెల్లడించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి తో జనసేన లోపాయికారి ఒప్పందం చేసుకుందని ఆయన ఆరోపించారు. ఆరు సంవత్సరాల్లో ఆరు పార్టీలతో పొత్తు పెట్టుకున్న రికార్డును జనసేన సాధించిందని గుడివాడ సెటైర్లు వేశారు.
Also Read:వీడియో గేమ్‌లు ఆడుకునే లోకేశ్‌ను మంత్రిని చేశారు: బాబుపై గుడివాడ వ్యాఖ్యలు
జనసేన అధినేతకు రెండు చోట్ల ఓడిపోయిన చరిత్ర ఉందని, పవన్ కల్యాణ్ నేరగాళ్లకు ఓటేస్తారా అనే ప్రశ్నకు ప్రజలు సరైన సమాధానం చెప్పారని అందుకే 2019లో ప్రజలు వారికి ఓటు వెయ్యలేదన్నారు. స్దిరత్వం, సిద్దాంతం, వ్యక్తిత్వం ఏమీ పవన్ కల్యాణ్ కు లేదని అమర్‌నాథ్ చెప్పారు.
కోవిడ్ వైరస్ కారణంతో ఎన్నికల వాయిదా వేశారు, ఎన్నికలు ఎప్పుడు జరిగిన ఫలితం ఒకటే వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. స్దానికసంస్దల ప్రక్రియ చాలా ప్రశాంతంగా జరుగుతోందని, టీడీపీ హయాంలో స్థానిక ఎన్నికలు హింసాత్మకంగా జరిగాయని అమర్‌నాథ్ గుర్తుచేశారు.