ఎక్సైజ్ శాఖ తనిఖీలు: విశాఖలో భారీగా గంజాయి పట్టివేత

By Siva Kodati  |  First Published Feb 23, 2020, 3:36 PM IST

విశాఖపట్నం జిల్లాలో ఆదివారం భారీగా గంజాయిని పట్టుకున్నారు. కొయ్యూరు మండలం మర్రిపాలెం చెక్‌పోస్ట్ వద్ద ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.


విశాఖపట్నం జిల్లాలో ఆదివారం భారీగా గంజాయిని పట్టుకున్నారు. కొయ్యూరు మండలం మర్రిపాలెం చెక్‌పోస్ట్ వద్ద ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

Also Read:video news : లోటస్ హోటల్ దగ్గర గంజాయి స్వాధీనం

Latest Videos

undefined

ఈ సమయంలో చింతపల్లి ఏజెన్సీ నుంచి వస్తున్న హెచ్ఆర్ 55బీ 5312 నెంబర్ గల కంటైనర్‌ను ఆపి పరిశీలించగా అందులో 325 కిలోల గంజాయి లభ్యమైంది. వ్యాన్‌లో దీనిని అక్రమంగా రవాణా చేస్తున్న ఐదుగురు వ్యక్తులు పరారయ్యారని ఎక్సైజ్ శాఖ సీఐ తెలిపారు. దీని విలువ సుమారు 16 లక్షలు ఉంటుందని ఆయన వెల్లడించారు. 

Also Read:నిషామత్తులో వరంగల్ నిట్ : విద్యార్థులపై సస్పెన్షన్ వేటు

కొద్దిరోజుల క్రితం గుంటూరు జిల్లా తాడేపల్లి లోటస్ హోటల్ దగ్గర వాహన తనిఖీలు చేస్తుండగా గంజాయి పట్టుబడింది. స్విప్ట్ కారులో ఉన్న 2 కేజీల 200 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్న హైదరాబాద్ కు చెందిన నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులను అరెస్ట్ చేశారు. వీరిపై   కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

click me!