''అమ్మా మేం చనిపోతున్నాం...వెతకకండి...''... విశాఖలో ముగ్గురు అక్కాచెల్లెల్లు మిస్సింగ్

Arun Kumar P   | Asianet News
Published : Feb 18, 2020, 02:20 PM ISTUpdated : Feb 18, 2020, 05:29 PM IST
''అమ్మా మేం చనిపోతున్నాం...వెతకకండి...''... విశాఖలో ముగ్గురు అక్కాచెల్లెల్లు మిస్సింగ్

సారాంశం

విశాఖపట్నంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అమ్మాయిల మిస్సింగ్  తీవ్ర కలకలం రేపుతోంది. 

విశాఖపట్నం: విశాఖపట్నంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెల్ల అదృశ్యం కలకలం రేపుతోంది. ఇంట్లోంచి బయటకు వెళ్లిన కూతుళ్లు తిరిగి రాకపోగా... వారి ఫోన్ నంబర్ల నుండి ఆ తల్లిదండ్రులకు ''ఆత్మహత్య చేసుకుంటున్నాం...వెతకకండి'' మెసేజ్ వచ్చింది. దీంతో తీవ్ర ఆందోళనకు లోనయిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

దీంతో ద్వారకానగర్ పోలీసులు కేసు నమోదు  చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. యువతుల ఆఛూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. అలాగే సాంకేతికత సాయంతో అంటూ విద్యార్థుల  సెల్ పోన్ సిగ్నల్ ఆధారంగా ఆచూకీ కనిపెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటివకు వారి జాడ తెలియలేదు. 

అయితే యువతులు స్వతహాగానే ఇంట్లోంచి వెళ్లారా... లేక ఎవరయినా కిడ్నాప్ చేశారా అన్న కోణంలో కూడా పోలీసుల విచారణ సాగుతోంది. అలాగే వారు తల్లిదండ్రులకు పంపిన మెసేజ్ ఆధారంగా విశాఖపట్నం చుట్టుపక్కల గల  సూసైడ్ స్పాట్స్ వద్ద కూడా గాలింపు చేపట్టారు. వీరి ఆచూకీ తెలిస్తే తమకు తెలియజేయాలని పోలీసులు ఓ ప్రకటన చేశారు. 

అయితే తాజాగా తాము చైన్నె లో క్షేమంగా ఉన్నట్లు తల్లిదండ్రులకు ముగ్గురు యువతులు సమాచారం అందించినట్లు తెలస్తోంది. వారు చెన్నై ఎందుకు వెళ్లారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమ బిడ్డలను  క్షేమంగా తీసుకురావలని తల్లిదండ్రులు పోలీసులను కోరుతున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

విశాఖలో స్పా ముసుగులో చీకటి దందా
Yoga Day: విశాఖలో యోగా డే.. ఐదు లక్షల మందితో గిన్నిస్ రికార్డు