
విశాఖపట్నం: జిల్లాలోని గాజువాకలో విషాద ఘటన చోటుచేసుకుంది. విశాఖ స్టీలుఫ్లాంట్ లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారింది.
శ్రీకాకుళం జిల్లా ఏచ్చెర్ల మండలం రంపపేట గ్రామానికి చెందిన సాదు సతీష్ ఈఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అతడు ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ లో విధులు నిర్వహించేవాడు.
read more ''అమ్మా మేం చనిపోతున్నాం...వెతకకండి...''... విశాఖలో ముగ్గురు అక్కాచెల్లెల్లు మిస్సింగ్
అయితే ఇవాళ ఉదయం ఏమయిందో తెలీదు కానీ క్షణికావేశంలో దారుణ నిర్ణయం తీసుకున్నాడు. విశాఖలోని క్లాక్ నంబర్ 11 వద్ద INSAS రైఫిల్ తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సంఘటనా స్థలంలో పడివున్న రైఫిల్ ను స్వాదీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.