సింహాచలం భూముల్లో చర్చీల నిర్మాణం...లెక్కతేలాలి: పరిపూర్ణానంద సంచలనం

By Arun Kumar PFirst Published Mar 10, 2020, 9:33 PM IST
Highlights

విజయనగర వంశీయులు 50 వేల ఎకరాల భూములను దానం చేసిన మహానుభావులని పరిపూర్ణానంద స్వామి కొనియాడారు. 

రాష్ట్ర ప్రభుత్వం సింహాచలం భూములను ఆక్రమించి ఎన్ని చర్చీలు నిర్మాణం చేసారో లెక్కలు తేల్చాలని పరిపూర్ణ నంద స్వామి డిమాండ్ చేశారు. బీజేపీ పార్టీ సమావేశ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో స్వామిజీ మాట్లాడుతూ... రాష్ట్ర  ప్రభుత్వం అశోకగజపతి రాజును రాత్రికి రాత్రే తప్పించడం సరైన పద్దతి కాదని ప్రశ్నించారు. 

విజయనగర వంశీయులు 50 వేల ఎకరాల భూములను దానం చేసిన మహానుభావులని కొనియాడారు. రాజకుటుంభానికి ద్రోహం జరిగిందని తక్షణమే ప్రభుత్వం పునరాలోచన చేసి సరిద్దిద్దాలని అన్నారు. 105 దేవాలయాలను పోషిస్తున్న కుటుంబానికి న్యాయం జరగాల్సిన అవసరం వుందన్నారు. 

read more  మా నాన్న చితి ఆరక ముందే...: బాబాయ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ సంచయిత కంటతడి

హిందూ సమాజం తరపున స్పందన మొదలవుతుందని... ప్రభుత్వం నరసింహ స్వామి ఆగ్రహానికి గురి కావద్దని హితవు పలికారు. దేవాలయాల ఆస్తులు,భూములను ప్రభుత్వం రక్షించాలని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలంతా  ఈ విషయంలో ఆవేదన చెందుతున్నారని అన్నారు. 

తిరుమల సీజీఫ్ నిధులపై శ్వేతపత్రం విడుదల చేసి చూపాలని లేదంటే హిందూ భక్తులకు ద్రోహం చేస్తున్నట్లేనని అన్నారు. మాన్సస్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నవారికి న్యాయం జరగాలని లేనిపక్షంలో గిరి ప్రదిక్షణ చేసి ప్రజలను చైతన్య పరుస్తానని అన్నారు.

click me!