బహిరంగ వేదికపైనే బోరున ఏడ్చేసిన మహిళా డిప్యూటీ సీఎం

By Arun Kumar PFirst Published Mar 7, 2020, 9:10 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పాముల పుష్ఫశ్రీవాణి మరోసారి బహిరంగ వేదికపైనే కన్నీరు మున్నీరుగా విలపించారు. అయితే ఈసారి ఆమె ఆవేదనకు భర్త పరీక్షిత్ రాజుకు జరిగిన అవమానమే కారణమట. 

విజయనగరం: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖమంత్రి పుష్పశ్రీవాణి మరోసారి బహిరంగ వేదికపైనే కన్నీరు మున్నీరుగా విలపించారు. సాటి మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ విజయసాయి రెడ్డిలు ఓదారుస్తున్న దు:ఖాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయింది. అయితే ఆమె ఇంతలా బాధపడటానికి కారణం ఆమె భర్తేనట. 

ఇంతకూ ఏం జరిగిందంటూ... సొంత జిల్లా విజయనగరంలోని కురపాం నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో పుష్ఫశ్రీవాణి భర్త పరీక్షిత్ రాజుతో  కలిసి పాల్గొన్నారు. అయితే నిర్వహకులు మాత్రం కేవలం మంత్రిని మాత్రమే వేధికపైకి ఆహ్వానించారు. దీంతో తన భర్తను కాదని తనను మాత్రమే వేధికపైకి పిలవడాన్ని శ్రీవాణి తట్టుకోలేకపోయారు. భర్తకు అవమానం జరిగిందని భావించి కన్నీటిపర్యంతమయ్యారు. 

దీంతో వెంటనే అక్కడున్న అధికారులు, వైసిపి నాయకులు మంత్రి ఆవేదనకు కారణాన్ని గుర్తించి ఆమె భర్తను కూడా వేదికపైకి ఆహ్వానించారు. దీంతో మంత్రి శ్రీవాణి సంతృప్తి చెంది ఏడుపును ఆపేశారు. 

గతంలో కూడా జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలోనే శ్రీవాణి భావోద్వేగాని లోనయ్యారు. తాను జీవితాంతం వైసీపీలోనే ఉంటానని, జగనన్న వెంట నడుస్తానని... తన చేతిపై వైఎస్‌ఆర్ పచ్చబొట్టు పొడిపించుకున్నానంటూ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. సీఎం జగన్‌ ఆశీస్సులు తమకు మెండుగా ఉన్నాయంటూ శ్రీవాణి భావోద్వేగాని లోనయ్యారు. 

click me!