భర్త మోసం చేశాడని కుంగిపోలేదు ఆ మహిళ. అతడు వదిలేసి వెళ్ళిన వస్తువుల్ని చూస్తూ బాధపడుతూ కూర్చోలేదు. వాటిని ఆక్షన్ పెట్టింది. ఫేస్ బుక్ లైవ్ లో అమ్మేసి లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంది.
ఫిలిప్పీన్స్ : భర్త చేతిలో మోసపోతే ఏ woman అయినా ఏం చేస్తుంది.. మనస్తాపం చెందుతుంది.. ఏడుస్తుంది... బాధపడుతుంది. దాన్నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. అయితే ఈ విషయంలో మనదేశంలోని మహిళలకు విదేశీయులకు కొంచెం తేడా ఉంటుంది. వారు కాస్త తొందరగా ఈ బాధనుంచి బయటపడుతుంటారు. వేరొకరిని పెళ్లి చేసుకుని తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. కానీ ఓ విదేశీ మహిళ మాత్రం వినూత్న రీతిలో ఆలోచించింది. భర్త వదిలేసిన వెళ్లిన వస్తువులను cash చేసుకుంది. అంతే కాకుండా మిగతా మహిళలు కూడా తన బాటలో నడవాలని సూచించింది. ఇంతకీ ఆమె ఏం చేసిందనే వివరాల్లోకి వెళితే..
ఫిలిపిన్స్ కు చెందిన జెమిల్లే అనే మహిళ కొన్నేళ్ళ క్రితం ఓ వ్యక్తిని ఇష్టపడి పెళ్లి చేసుకుంది. పెళ్లయిన కొత్తలో ఆ జంట సంతోషంగా జీవితం గడిపింది. ఆ తర్వాత అతడు జెమిల్లేని మోసం చేశాడు. ఒంటరి చేసి వెళ్ళిపోయాడు. ఈ క్రమంలో కొంత భావోద్వేగానికి గురైన ఆమె.. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వదిలేసి వెళ్ళిపోయిన వారి గురించి బాధపడుతూ కూర్చుంటే లాభం లేదని భావించింది. ఈ నేపథ్యంలోనే తన భర్త కు సంబంధించిన బ్రాండెడ్ దుస్తులు, వస్తువులను ఫేస్బుక్లో లైవ్ లోకి వచ్చి వేలం వేసింది. ఏకంగా రూ.4.38 లక్షలు సంపాదించింది.
undefined
భర్త చేతిలో మోసపోయిన మహిళలు తనలాగా చేయాలని సూచించింది. భర్త వదిలేసి వెళ్ళిపోయిన వాటిని చూస్తూ బాధ పడటమో లేక వాటిని ఊరికే చెత్త బుట్టలో పడేయడమో చేయకుండా తనలా క్యాష్ చేసుకోవాలని వెల్లడించింది. కాగా, ప్రస్తుతం ఈ వార్త స్థానికంగా చర్చనీయాంశమైంది.
ఇదిలా ఉండగా, odishaలోని భువనేశ్వర్‌లో ఓ lovecouple గొడవ మధ్యలో food delivery boy జోక్యం చేసుకోవడంతో.. గొడవ పెద్దదై వివాదాస్పదంగా మారింది. ఫుడ్ డెలివరీ బాయ్ ప్రేమికురాలిని తీవ్రంగా కొట్టడంతో ఇరువర్గాల మీద పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మంగళవారంనాడు ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెడితే.. మంగళవారంనాడు భువనేశ్వర్ లోని ఇందిరా గాంధీ పార్క్ లో ఓ ప్రేమికుల జంట కలుసుకుంది. వారిద్దరి మధ్య ఏ విషయంలో గొడవ వచ్చిందో తెలియదు కానీ.. పార్కునుంచి బయటికి వస్తూనే తీవ్ర వాగ్వాదానికి దిగారు. ప్రియుడిని ఆమె ఇష్టం వచ్చినట్టుగా.. గట్టిగా అరుస్తూ నిలదీస్తుంది. ప్రశ్నిస్తుంది. కానీ బండిమీద హెల్మెట్ పెట్టుకుని, చేతులు కట్టుకుని కూర్చున్న అతను మాత్రం ఏమీ మాట్లాడడం లేదు. దీంతో ఆ అమ్మాయి మరింత రెచ్చిపోయి అతన్ని తిట్టిపోసింది. పక్కనున్న రాయి తీసుకుని కొట్టబోయింది. ఇదంతా అక్కడున్న వాళ్లు వీడియో తీస్తుంటే.. వారి ఫోన్లు లాక్కునేందుకు ప్రయత్నించింది.
ఈ సమయంలోనే అటుగా వెడుతున్న ఓ ఫుడ్ డెలివరీ బాయ్ కూడా వీరి గొడవ చూశాడు. ఆగి వారిద్దరినీ శాంతింపచేసే ప్రయత్నం చేశాడు. ఎంత చెప్పినా ఆ గొడవ సద్దుమణగలేదు. సరికదా ఆ యువతి ఫుడ్ డెలవరీ బాయ్ మీద కూడా అసభ్య పదజాలంతో విరుచుకుపడింది. దీంతో తిక్కరేగిన అతను ఆమెను కొట్టాడు. వీడియో ప్రకారం.. ఆమెను నెట్టివేస్తూ.. తిడుతూ, గొడవపడుతూ.. చివరికి చెంపమీద గట్టిగా కొట్టాడు. ఇది చూసిన వాహనదారులు వచ్చి వారిని ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు.