లవర్స్ గొడవ మధ్యలో దూరిన ఫుడ్ డెలివరీ బాయ్.. వివాదం ముదిరి.. యువతిని చితగ్గొట్టి.. వీడియో వైరల్...

By SumaBala Bukka  |  First Published Apr 1, 2022, 10:56 AM IST

ఓ ఫుడ్ డెలివరీ బాయ్ అత్యుత్సాహం చూపించాడు. ప్రేమికుల గొడవను చల్లబరుద్దామని వెళ్లి.. ప్రేమికురాలి మీద విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు ఇరువురి మీద కేసు నమోదు చేసే యోచనలో ఉన్నారు. 


ఒడిశా : odishaలోని భువనేశ్వర్‌లో ఓ lovecouple గొడవ మధ్యలో food delivery boy జోక్యం చేసుకోవడంతో.. గొడవ పెద్దదై వివాదాస్పదంగా మారింది. ఫుడ్ డెలివరీ బాయ్ ప్రేమికురాలిని తీవ్రంగా కొట్టడంతో ఇరువర్గాల మీద పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.  ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మంగళవారంనాడు ఈ ఘటన జరిగింది. 

వివరాల్లోకి వెడితే.. మంగళవారంనాడు  భువనేశ్వర్ లోని ఇందిరా గాంధీ పార్క్ లో ఓ ప్రేమికుల జంట కలుసుకుంది. వారిద్దరి మధ్య ఏ విషయంలో గొడవ వచ్చిందో తెలియదు కానీ.. పార్కునుంచి బయటికి వస్తూనే తీవ్ర వాగ్వాదానికి దిగారు. ప్రియుడిని ఆమె ఇష్టం వచ్చినట్టుగా.. గట్టిగా అరుస్తూ నిలదీస్తుంది. ప్రశ్నిస్తుంది. కానీ బండిమీద హెల్మెట్ పెట్టుకుని, చేతులు కట్టుకుని కూర్చున్న అతను మాత్రం ఏమీ మాట్లాడడం లేదు. దీంతో ఆ అమ్మాయి మరింత రెచ్చిపోయి అతన్ని తిట్టిపోసింది. పక్కనున్న రాయి తీసుకుని కొట్టబోయింది. ఇదంతా అక్కడున్న వాళ్లు వీడియో తీస్తుంటే.. వారి ఫోన్లు లాక్కునేందుకు ప్రయత్నించింది. 

Latest Videos

undefined

ఈ సమయంలోనే అటుగా వెడుతున్న ఓ ఫుడ్ డెలివరీ బాయ్ కూడా వీరి గొడవ చూశాడు. ఆగి వారిద్దరినీ శాంతింపచేసే ప్రయత్నం చేశాడు. ఎంత చెప్పినా ఆ గొడవ సద్దుమణగలేదు. సరికదా ఆ యువతి ఫుడ్ డెలవరీ బాయ్ మీద కూడా అసభ్య పదజాలంతో విరుచుకుపడింది. దీంతో తిక్కరేగిన అతను ఆమెను కొట్టాడు. వీడియో ప్రకారం.. ఆమెను నెట్టివేస్తూ.. తిడుతూ, గొడవపడుతూ.. చివరికి చెంపమీద గట్టిగా కొట్టాడు. ఇది చూసిన వాహనదారులు వచ్చి వారిని ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. 

అయితే ఆ మహిళ కానీ, డెలివరీ ఎగ్జిక్యూటివ్ కానీ దీనిమీద ఇప్పటివరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. భువనేశ్వర్ డిసిపి ఉమాశంకర్ దాష్ మాట్లాడుతూ, వీడియోలు వైరల్ అయిన నేపథ్యంలో "ఇది ఇరువర్గాలు ఒకరినొకరు కొట్టుకున్న సంఘటన కాబట్టి, వారిద్దరిపై కేసు నమోదు చేయాలని సంబంధిత పిఎస్ అధికారిని ఆదేశించాను" అని తెలిపారు.


 

Girl direct volley of expletives, beat up Boyfriend in full public glare outside Park in pic.twitter.com/7ZVUrfz7Wd

— Mohammad Suffian (@iamsuffian)

Food Delivery boy who tried to intervene and pacify the matter, losses his cool after scolded by the girl, started beating the girl.
Case registered against both parties pic.twitter.com/DqINUglqH0

— Mohammad Suffian (@iamsuffian)
click me!