74ఏళ్ల తర్వాత కలిసిన అన్నదమ్ములు.. ఒకరు భారత్ లో, మరొకరు పాకిస్తాన్ లో..!

By telugu news team  |  First Published Mar 28, 2022, 11:10 AM IST

1947లో ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చాకా అఖండ భారతదేశం రెండు దేశాలుగా విడిపోయింది. అందులో ఒక ఇండియా కాగా… మరొకటి పాకిస్థాన్​గా ఏర్పడింది. 


తల్లిదండ్రుల తర్వాత మనం అంతగా ప్రేమ పంచుకునేది మన తోడపుట్టిన వారి మీదే. వారు కొంత కాలం దూరం ఉంటేనే తట్టుకోలేం. అలాంటిది.. ఏకంగా 74 సంవత్సరాలు ఆ అన్నదమ్ములు విడిపోయారు. వారు విడిపోవడానికి  దేశ విభజన కారణం కావడం గమనార్హం. చివరకు 74ఏళ్ల తర్వాత.. వారు మళ్లీ ఒకరినొకరు  చూసుకోగలిగారు. ఈ సంఘటన మన దేశంలోనే చోటుచేసుకోగా..  ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

1947లో ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చాకా అఖండ భారతదేశం రెండు దేశాలుగా విడిపోయింది. అందులో ఒక ఇండియా కాగా… మరొకటి పాకిస్థాన్​గా ఏర్పడింది. అంటే అప్పట్లో విభజన సమయం లో ఈ ఇద్దరు అన్నదమ్ములు విడిపోయారు. దశాబ్దాల క్రితం దూరమైన అన్నదమ్ములను పాకిస్థాన్‌లోని కర్తార్​పుర్ సాహిబ్ ఒక్క దగ్గరకు చేర్చింది.

Latest Videos

undefined

 

దేశ విభజన కారణంగా ఒకరు పాకిస్థాన్‌కు, మరొకరు భారతదేశానికి వచ్చారు. కారణమేంటో తెలియదుగానీ.. ఇప్పటివరకూ ఒకరినొకరు కలవలేకపోయారు. అలా చూస్తుండగానే 70 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి. ఈ అన్నదమ్ముల సంతానం చొరవో ఏమో కానీ… 74 ఏళ్ల తర్వాత ఈ సోదరులు ఇద్దరు ఒక్కచోట కలుసుకున్నారు. 74 ఏళ్ల తర్వాత కలుసుకున్న సోదరులిద్దరి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

1947లో భారత్-పాకిస్థాన్ విడిపోయిన తర్వాత వేలాది కుటుంబాలు వేరుపడ్డాయి. కొందరు తమ బంధుమిత్రులను కొన్నేళ్ల తర్వాత తిరిగి కలుసుకున్నారు. మరికొందరు మాత్రం తమ వారిని చేరుకోలేకపోయారు. ఆ కోవకే చెందిన ఈ ఇద్దరు సోదరులు ఇన్నేళ్ల తర్వాత ఒక దగ్గరికి చేరారు. వీరి గురించి తెలుసుకున్న వారి బంధుమిత్రులు, స్థానికులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

74 ఏళ్ల తర్వాత కలుసుకున్న ఆనందంలో సోదరులిద్దరూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని కంటతడి పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

click me!