కంపెనీ హెడ్ షాట్ లో.. టాటూలను చూపిస్తూ మహిళ ఫోటోలు.. వైరల్..!

Published : Jan 19, 2022, 04:19 PM IST
కంపెనీ హెడ్ షాట్ లో.. టాటూలను చూపిస్తూ మహిళ ఫోటోలు.. వైరల్..!

సారాంశం

 ఈ ఫోటోలు వైరల్ గా మారితే.. తనపై విమర్శలు వస్తాయని..వాటిని ఎదుర్కోవడానికి కూడా తాను సిద్ధంగా ఉండాలని ముందే నిర్ణయం తీసుకున్నానని జెస్సికా లియోనార్డ్  పేర్కొన్నారు.  

గత దశాబ్దకాలంగా.. వృత్తిపరంగా టాటూలు, కుట్లు, అసాధారణ జుట్టుకు రంగులు వేయడం లాంటివి నిషేధంగా పరిగణిస్తూ వస్తున్నారు. అయితే.. ఒక మహిళ.. ఆ సంప్రదాయానికి స్వస్తి పలికింది. తన  కంపెనీ హెడ్ షాట్ లో తన ఫుల్ స్లీవ్ ఆర్మ్ టాటూలను  చూసించడం గమనార్హం. కాగా... ఆ టాటూ హ్యాండ్స్ తో ఉన్న ఆమె ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

అయితే.. ఈ ఫోటోలు వైరల్ గా మారితే.. తనపై విమర్శలు వస్తాయని..వాటిని ఎదుర్కోవడానికి కూడా తాను సిద్ధంగా ఉండాలని ముందే నిర్ణయం తీసుకున్నానని జెస్సికా లియోనార్డ్  పేర్కొన్నారు.

జెస్సికా లియోనార్డ్(36) టాటూలతో దిగిన ఫోటోని లింక్డిన్ లో షేర్ చేయగా.. ఆ పోస్టుకి 30వేలపైగా లైకులు వచ్చాయి. 3వేలకు పైగా కామెంట్స్ వచ్చాయి. ఒక ఫోటో జాకెట్ ధరించి.. మరో ఫోటో టాటూలు కనిపించేలా షేర్ చేయడం గమనార్హం.

కొందరు.. ఆమె టాటూ పోస్టుకి పాజిటివ్ గా స్పందించగా.. కొందరు మాత్రం.. అది కరెక్ట్ కాదని.. అలాంటి ఫోటోలు పెట్టొద్దని.. టాటూలు వేయించుకోవడం కరెక్ట్ కాదని ఆమెకు చెప్పాలనే ప్రయత్నం చేయడం గమనార్హం.

లియోనార్డ్, క్లీవ్‌ల్యాండ్, ఒహియో, స్థానికురాలు, టాటూ ఫోటోను పోస్ట్ చేయడం గురించి ఆమె మొదట్లో భయపడ్డానని, అయితే ఆమె బాస్ వాస్తవానికి ఆమెకు అవసరమైన విశ్వాసాన్ని పెంచారని చెప్పారు. తన బాస్ ఇచ్చిన సపోర్ట్ తోనే.. తాను ఎలాంటి భయం లేకుండా ఆ ఫోటోలను షేర్ చేయగలిగానని చెప్పడం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

Viral News: ఆన్‌లైన్‌లో ల్యాప్‌టాప్ ఆర్డ‌ర్ చేసిన యువ‌కుడు.. పార్సిల్‌ ఓపెన్ చేసి చూడ‌గా షాకింగ్ సీన్
Viral Video : చేతిలో టీ గ్లాస్ పట్టుకుని పగలబడి నవ్వే... ఈ కుర్రాడు ఎవరో తెలుసా?