బంధువులే కావడంతో వారి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. తాము ప్రేమించుకున్నామని.. పెళ్లి చేయాలని ఆ జంట పెద్దను కోరారు. అందుకు ఇరు కుటుంబంలోని పెద్దలు ఒప్పుకోకపోవడంతో.. ఈ నెల 13న పెద్దలను ఎదిరించి వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. భార్గవి తండ్రి ఆమెపై కోపం పెంచుకున్నాడు కూతురుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాడు. తన కూతురు చనిపోయింది అంటూ గుండు గీయించుకున్నాడు. ఆమెకు కర్మకాండలు కూడా జరిపించాడు.
మహబూబ్ నగర్ : Mahabubnagar లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు social mediaలో వైరల్ గా మారింది. ఎంతో ప్రేమగా చూసుకున్నా.. కూతురు తనకు ఇష్టం లేని marriage చేసుకుందని ఓ తండ్రి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. కూతురు love marriage చేసుకుందని ఆమె బతికుండగానే పిండం పెట్టాడు. గుండు గీయించుకుని దినకర్మలు కూడా నిర్వహించాడు.
ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని చిన్న చింతకుంట మండలం మద్దూరు గ్రామానికి చెందిన భార్గవికి అదే గ్రామానికి చెందిన వెంకటేష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ తరువాత ఇద్దరు సమీప బంధువులే అని తెలిసింది. బంధువులే కావడంతో వారి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలనుకున్నారు.
తాము ప్రేమించుకున్నామని.. పెళ్లి చేయాలని ఆ జంట పెద్దను కోరారు. అందుకు ఇరు కుటుంబంలోని పెద్దలు ఒప్పుకోకపోవడంతో.. ఈ నెల 13న పెద్దలను ఎదిరించి వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇది వీరి పెద్దలకు కోపాన్ని తెప్పించింది. బంధువుల అబ్బాయే.. అమ్మాయే అయినా పెళ్లికి వారు ఇష్టపడలేదు.
undefined
మామూలుగా అయితే కోపం వస్తే.. ఇంట్లోకి రానివ్వకపోవడమో, మాట్లాడకపోవడమో చేస్తారు. అయితే ఇక్కడ భార్గవి తండ్రి మాత్రం ఒక్కడుగు ముందుకు వేశాడు. పాత సినిమాల్లో సోమయాజులు టైపు.. అత్తారింటికి దారేదీలో బొమన్ ఇరానీ లాంటోడు... ఆయన ఊరుకుంటాడా? ఆ సినిమాల్లో చూపించినట్టుగానే కక్ష సాధించాడు. తన మాట కాదని పెళ్లి చేసుకుంది.. కాబట్టి తన కూతురు తనకు చచ్చిపోయిందని నిర్ణయానికి వచ్చాడు. అదే ప్రకటించాడు.
అంటితో ఆగకుండా.. తమ కూతురు తమను కాదని ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుందని భార్గవి తండ్రి ఆమెపై కోపం పెంచుకున్నాడు కూతురుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాడు. తన కూతురు చనిపోయింది అంటూ గుండు గీయించుకున్నాడు. ఆమెకు కర్మకాండలు కూడా జరిపించాడు. దీనికోసం ఫ్లెక్సీలు కూడా ముద్రించాడు. కూతురు చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కీ.శే. కమ్మరి భార్గవి.. జననం.. మరణం అంటూ.. పెళ్లి చేసుకున్న తేదీని వేసి మరీ నివాళులు అర్పించాడు.
కూతురి ప్రేమ వివాహాన్ని భరించలేక తండ్రి చేసిన ఈ పని గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా, గ్రామంలో మరో మాటా వినిపిస్తోంది. కూతురు ఇష్టం మేరకు పెళ్లి చేస్తానని సదరు తండ్రి చెప్పినా… యువతీ, యువకుడు వినలేదని స్థానికంగా ప్రచారం సాగుతోంది.
తండ్రి పెళ్లి చేస్తానని చెప్పినా.. ఆ మాటపై నమ్మకం లేకనే ఆ యువతి గుడిలో ప్రేమ పెళ్లి చేసుకుందని కొందరు చెబుతున్నారు. అందుకనే తండ్రికి ఆ స్థాయిలో కోపం వచ్చిందని.. తన మాటకు విలువ ఇవ్వని బిడ్డకు పిండ ప్రధానం చేసి ఆక్రోశం వెళ్లగక్కాడు అని అంటున్నారు.