కాలేజీలో.. ప్రిన్సిపల్, ప్రొఫెసర్ కొట్లాట.. వీడియో వైరల్..!

Published : Jan 19, 2022, 03:18 PM IST
కాలేజీలో.. ప్రిన్సిపల్, ప్రొఫెసర్ కొట్లాట.. వీడియో వైరల్..!

సారాంశం

జనవరి 15న కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శేఖర్ మేడంవార్‌పై  ప్రొఫెసర్ అలునె దాడికి పాల్పడిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కేసు నమోదు చేయబడింది.

అతను కాలేజీలో ప్రొఫెసర్. పిల్లలకు చదువులు చెప్పాల్సిన ఆయన.. ఆ కాలేజీ ప్రిన్సిపాల్ ని కొట్టాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినిలో చోటుచేసుకోగా.... ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కాగా.. ప్రిన్సిపల్ పై దాడికి పాల్పడిన ప్రొఫెసర్ పై కేసు నమోదు చేయడం గమనార్హం.

ఉజ్జయినిలోని నాగూలాల్ మాలవ్య ప్రభుత్వ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ బ్రహ్మదీప్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అసభ్యకరమైన మాటలు మాట్లాడటం, గాయపరచడం చేశాడని.. అందుకే ఆయన పై కేసు నమోదు చేశామన్నారు.

జనవరి 15న కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శేఖర్ మేడంవార్‌పై  ప్రొఫెసర్ అలునె దాడికి పాల్పడిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కేసు నమోదు చేయబడింది.

అలునే గతంలో భూపాల్ లోని ప్రభుత్వ కళాశాలలో పనిచేశారు. కాగా.. బదిలీకావడంతో.. ఉజ్జయిని కాలేజీకి వచ్చారు.  కాగా.. ఇటీవల కాలేజీని టీకా కేంద్రంగా మార్చారు. కరోనా నేపథ్యంలో.. అందరికీ ఆ కాలేజీలో.. వ్యాక్సిన్ పంపకాలు మొదలుపెట్టారు. కాగా.. ఈ విషయం గురించి మాట్లాడదామని తాను ప్రొఫెసర్  అలునెని తన గదికి పిలిచానని.. దానికే.. అతను తనతో గొడవపడి.. దాడి చేశాడని ప్రిన్సిపల్ చెప్పడం గమనార్హం.

ప్రిన్సిపాల్ గదిలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఫుటేజీలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసినట్లు కనపడటం గమనార్హం. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం పెద్దదిగా మారింది.

 

కోపంతో ముందు ప్రొఫెసర్ తన కుర్చీలో నుంచి లేచి మరీ.. ప్రిన్సిపల్ ని కొట్టాడు.  ఆ తర్వాత... టేబుల్ మీద ఉన్న వస్తువులన్నింటినీ తీసుకొని.. అతనిపై విసిరేయడం మొదలుపెట్టాడు.

గొడవ మొత్తం బయటకు వినపడటంతో.. ఎవరో ఐదుగురు లోపలికి వచ్చి.. గొడవను అదుపు చేశారు. ప్రొఫెసర్ ఇంకా కోపంతో, ప్రిన్సిపాల్‌పై అరుస్తూనే ఉన్నాడు. ఆకస్మిక దాడి నుండి కోలుకున్న ప్రిన్సిపాల్ ప్రొఫెసర్‌కి సైగలు చేసి, గది నుండి బయటకు వెళ్లమని అడిగాడు, కానీ అతను వెళ్ళడానికి నిరాకరించి తన కుర్చీలో కూర్చున్నాడు.
 

PREV
click me!

Recommended Stories

Viral News : ఇక జియో ఎయిర్ లైన్స్.. వన్ ఇయర్ ఫ్రీ..?
Open to Marry: నన్ను పెళ్లి చేసుకుంటారా? లింక్డ్‌ఇన్ లో యువకుడి పెళ్లి ప్రపోజల్ వైరల్