పక్కింట్లో దొంగతనానికి ముతుంబా భార్యకు ఏదో సంబంధం ఉన్నట్లు పోలీసులకు అనుమానం కలిగింది. వారి అనుమానంలో భాగంగా ఓ మహిళా కానిస్టేబుల్ ముతుంబా భార్యను చెక్ చేసింది. ఆ చెకింగ్ లో నమ్మలేని నిజం బయటపడింది. ఆమె అసలు ఆమె కాదని.. అతను అని తేలింది.
అందమైన, మంచి సుగుణాలు గల యువతి తన భార్యగా రావాలని ప్రతి ఒక్క యువకుడు కలలు కంటాడు. పాపం... అందరిలాగానే అతను కూడా కలలు కన్నాడు. తాను ఊహించినట్లుగానే మంచి సంబంధం రాగానే... నిమిషం కూడా ఆలోచించకుండా పెళ్లి చేసుకున్నాడు. కానీ.. పెళ్లి చేసుకున్నాక రెండు వారాల తర్వాత అతనికి నమ్మలేని నిజం తెలిసింది. తాను పెళ్లి చేసుకుంది ఓ సుగుణాల యువతిని కాదని... ఓ యువకుడిని అని తెలిసి కంగుతిన్నాడు. అక్కడితో అయిపోలేదు.. ఈ పెళ్లి కారణంగా ఉద్యోగం కూడా పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన ఉగాండాలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే...ఉగాండా దేశానికి చెందిన షేక్ మొహమ్మద్ ముతుంబా (27) గత నాలుగు సంవత్సరాల నుంచి స్థానికంగా ఉన్న ఓ మసీదులో ఇమామ్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు డిసెంబర్‌లో ఇస్లామిక్ సంప్రదాయ పద్ధతిలో స్వాబుల్లా నబుకీరా అనే యువతితో వివాహమైంది. రెండు వారాల అనంతరం వారి పక్కింట్లో టీవీ, బట్టల దొంగతనం జరిగింది. దీంతో ఈ కేసుపై విచారణకు వచ్చిన పోలీసులకు దిమ్మతిరిగే నిజం తెలిసింది. దొంగతో పాటు ముతుంబా వివాహానికి సంబంధించిన ఓ భయంకర నిజం బయటపడింది.
undefined
Also Read లైఫ్ లో ఫస్ట్ టైమ్ వర్షం... ఈ చిన్నారి ఆనందం చూడండి.
పక్కింట్లో దొంగతనానికి ముతుంబా భార్యకు ఏదో సంబంధం ఉన్నట్లు పోలీసులకు అనుమానం కలిగింది. వారి అనుమానంలో భాగంగా ఓ మహిళా కానిస్టేబుల్ ముతుంబా భార్యను చెక్ చేసింది. ఆ చెకింగ్ లో నమ్మలేని నిజం బయటపడింది. ఆమె అసలు ఆమె కాదని.. అతను అని తేలింది. అబ్బాయి అయ్యి ఉండి.. అమ్మాయిలా నాటకం ఆడి కేవలం డబ్బు కాజేసేందుకే ముతుంబాను పెళ్లి చేసుకున్నట్లు తేలింది.
దీనిపై ముతుంబాను పోలీసులు ప్రశ్నించగా.. ఆమె పీరియడ్స్ లో ఉన్నానని చెప్పటంతో తన భార్యతో చనువుగా ఉండటం కుదరలేదని చెప్పాడు. అలాగే తన ఎదురుగా తన భార్య ఎప్పుడూ దుస్తులు మార్చుకోలేదని పోలీసులకు వివరించాడు. మసీదులో పనిచేసే వారు కూడా ముతుంబా భార్య గొంతు చాలా స్వీట్ గా ఉండేదని.. అబ్బాయి అనే అనుమానమే కలగలదేని.. నడక కూడా అచ్చం అమ్మాయిలానే ఉండేదని చెప్పారు.
అమ్మాయిలా నాటకమాడిన ఆ కిలాడీ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతని పేరు రిచర్డ్ తుముషబే అని తేలింది. షేక్ మొహమ్మద్ ముతుంబాకు చెందిన డబ్బు దోచుకోవడానికే పెళ్లి నాటకం ఆడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే... సంప్రదాయాలకు విరుద్ధంగా ఓ యువకుడిని పెళ్లాడాడనే కారణంతో తుముషబేని తన ఉద్యోగం నుంచి తీసేయడం గమనార్హం. ఆ షాక్ నుంచి తుముషబే.. ఇంకా కోలుకోలేదట. తన బంధువుల ఇంటికి వెళ్లి అక్కడే కౌన్సిలింగ్ తీసుకుంటున్నాడట.