శర్వానంద్ మహానుభావుడు సీన్ రిపీట్.. భర్తకు భార్య విడాకులు

By telugu teamFirst Published Jan 13, 2020, 10:38 AM IST
Highlights

రోజుకి 8గంటల పాటు చేసిన వాడు చేసినట్లే... స్నానం చేస్తూనే ఉండేవాడు. ఎందుకిలా అంటే.. శరీరం శుభ్రంగా లేదు అందుకే అని చెప్పేవాడట. రోజుకో సబ్బు అరగదీయకుండా బాత్రూమ్ నుంచి బయటకు వచ్చేవాడు కాదు. అతని తీరుకి తల్లికి విసుగు వచ్చింది. తట్టుకోలేక పోయింది.
 

భర్త స్నానం చేస్తున్నాడని... ఓ మహిళ విడాకులు ఇచ్చేసింది. అదేంటి..? శుభ్రంగా ఉంటే విడాకులు ఇవ్వడమేమిటనే అనుమానం మీకు రావొచ్చు. నిజమే... శుభ్రంగా ఉండటం ఎవరికైనా అవసరమే. అయితే... అది అతి శుభ్రత కాకూడదు. తుమ్మినా, దగ్గినా స్నానం చేస్తానంటే ఎవరికి మాత్రం చిరాకు రాదు చెప్పండి. రోజులో 8 గంటలు ఆ వ్యక్తి స్నానానికే సమయం కేటాయిస్తే... ఆ భార్య మాత్రం ఏం చేస్తుంది..? అందుకే ఈ అతి శుభ్రపు భర్త నాకొద్దు దేవుడా అంటూ కోర్టు మెట్లు ఎక్కింది. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.

మీరు హీరో శర్వానంద్ నటించిన మహానుభావుడు సినిమా చూసే ఉంటారు. అందులో హీరోకి ఓసీడీ. అంటే అతి శుభ్రత అనమాట. ఆ అతి శుభ్రత సినిమాలో కూడా మిగితా వారిని ఇబ్బంది పెట్టేలా ఉంటుంది. అది మనకు చూడటానికి కామెడీలా అనిపించడంతో ... కాసుల వర్షం కురిసింది. కానీ.. నిజ జీవితంలో అలాంటి జబ్బు ఉన్న వ్యక్తిని మాత్రం తట్టుకోవడం కష్టం. అలాంటి వ్యక్తి నాకు వద్దంటూ ఓ మహిళ భర్తకు విడాకులు ఇచ్చింది. 

పూర్తి వివరాల్లోకి వెళితే...  బెంగళూరుకి చెందిన టెక్కీ(32)కి ఐదారు సంవత్సరాల నుంచి అతి శుభ్రత అనే జబ్బు పట్టుకుంది. అతను తన తల్లితో కలిసి ఉండేవాడు. కాగా... రోజుకి 8గంటల పాటు చేసిన వాడు చేసినట్లే... స్నానం చేస్తూనే ఉండేవాడు. ఎందుకిలా అంటే.. శరీరం శుభ్రంగా లేదు అందుకే అని చెప్పేవాడట. రోజుకో సబ్బు అరగదీయకుండా బాత్రూమ్ నుంచి బయటకు వచ్చేవాడు కాదు. అతని తీరుకి తల్లికి విసుగు వచ్చింది. తట్టుకోలేక పోయింది.

Also READ మహిళ తో ప్రేమ.. మేనకోడలిపై అత్యాచారం.. గర్భం రావడంతో

పెళ్లి చేస్తే అతనిలో మార్పు వస్తుందని అతని తల్లి భావించింది. వెంటనే అతనికి సరైన జోడిగా భావించి ఓ యువతికి ఇచ్చి వివాహం జరిపించారు. కొత్తగా వచ్చిన భార్యకు భర్త పరిస్థితి అంతుబట్టక ఏకంగా విడాకులిచ్చి పుట్టింటికి వెళ్ళింది. ఇతడు ఐటి కంపెనీకి వెళ్ళినా అక్కడా సక్రమంగా పనిచేసేవారు కాదు. వాష్‌రూంకు వెళ్ళి డెట్టాల్‌తో తరచూ శుభ్రం చేసుకునేవారు. ఇక ఇంటికొస్తే స్నానపు గదికే పరిమితమయ్యేవారు.

 కొన్ని రోజులు ఇదేదో జబ్బుగా భావించారు. రోజూ ఆరేడు సబ్బులు ఖాళీ చేసేవారు. తెల్లవారుజామున 5గంటలనుంచి దాదాపు 9 వరకు, సాయంత్రం 6నుంచి 10వరకు స్నానపుగదిలోనే గడిపేవారు. ఎవరైనా తాకినా, తలుపు లేదా కంప్యూటర్‌ ఇతర వస్తువులు తాకేందుకు భయపడేవారు. అందుకు చేతికి గ్లవ్స్‌ వేసుకునేవారు. 

యలహంకలోని పీపుల్స్‌ ట్రీ మార్గ్‌ ఆసుపత్రికి చేర్పించగా అబ్సెస్సివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌ (ఓసీడీ) లేదా గీళు జబ్బుగా పిలుస్తారు. వంశపారంపర్యం, లేదా మానసిక ఒత్తిడితో జబ్బు వస్తుందని డాక్టర్లు నిర్ధారించారు.  పుస్తకం చదివినా మరోసారి తొలి పేజీనుంచి చదవడం, తలుపులు వేశారో లేదా పదే పదే పరిశీలించుకోవడం, లెక్కలు వేసుకోవడం వీరిలో కనిపించే లక్షణాలుగా ఉంటాయి. ప్రస్తుతం అతనికి వైద్యులు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. 

click me!