ఓ రాయి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానికి మంటపెడితే వైఫై సిగ్నల్స్ వస్తున్నాయి. దీని గురించి తెలుసుకోవడానికి, చూడడానికి జనం ఎగబడుతున్నారు.
జర్మనీ : ప్రపంచంలో వింతలకు కొదవలేదు. ప్రతీరోజూ ప్రపంచంలోని ఏదో మూలా ఏదో అద్భుతం వెలుగులోకి వస్తూనే ఉంది. అలాంటి అద్భుతాల్లో ఒకటే ఇంటర్నెట్ రాయి.. ఆ రాయికి కాస్త సెగ తగిలిస్తే చాలు.. మీ ఇంటర్నెట్, వైఫై సిగ్నల్స్ ఫుల్ యాక్టివ్ అవుతాయి. ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజంగా నిజం ఈ ఆద్భుతం జర్మనీలోని న్యూయెన్‌కిర్చెన్‌లోని అవుట్‌డోర్ స్కల్ప్చర్స్ మ్యూజియంలో ఉంది.
ఎంత స్పీడ్ వైఫై పెట్టుకున్నా.. నెట్ సిగ్నల్స్ ప్రాబ్లం ఇస్తూనే ఉంటాయి. ఒక్కోసారి ఫోన్ పట్టుకుని సిగ్నల్ కోసం వీధుల వెంట.. బిల్డింగుల మీదికి కూడా ఎక్కుతుంటారు. కానీ ఈ రాయి ఉంటే మీకా సమస్య ఉండదు. నెట్ సిగ్నల్ రాకపోయినా.. వైఫై పనిచేయకపోయినా.. ఈ రాయి దగ్గర మంట పెడితే చాలు. అటోమేటిక్ గా అవి ఆన్ అయిపోతాయి.
undefined
ఈ అరుదైన రాయి న్యూయెన్‌కిర్చెన్, జర్మనీ మ్యూజియం ఆఫ్ అవుట్‌డోర్ స్కల్ప్చర్స్‌లో కనుగొన్నారు. శాస్త్రవేత్తలు కూడా దీని గురించి తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు. దీంతో ఇది బ్రేకింగ్ న్యూస్ అయ్యింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుదూర ప్రాంతాల నుండి ప్రజలు దీనిని చూడటానికి, తాము విన్నది నిజమే కాదో తెలుసుకోవడానికి దానితో ప్రయోగాలు చేయడానికి వస్తున్నారు.
వాస్తవానికి ఇది కృత్రిమ రాయి, దానిలో థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ అమర్చబడింది. దాని దగ్గర మంటలు పెడితే, అది వేడిని విద్యుత్తుగా మారుస్తుంది. ఇది రాయిని పనిచేసేలా చేస్తుంది. రాయి లోపల విద్యుత్తు ఆన్ అవ్వగానే వెంటనే, వైఫై రూటర్ ఆన్ అవుతుంది. ఇంటర్నెట్ సిగ్నల్స్ ప్రారంభమవుతాయి.
ఈ అరుదైన రాయి బరువు దాదాపు 1.5 టన్నులు. ఈ కళాకృతిని కీప్ అలైవ్ అని పిలుస్తారు. ఎరామ్ బర్తోల్ అనే వ్యక్తి దీన్ని తయారు చేశాడు. ఈ ఆవిష్కరణతో ఎరమ్ బర్తోల్ ముఖ్యాంశాలలో నిలిచాడు.